ఒకప్పుడు ‘యముడు` బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమాలను సక్సెస్ మంత్రులుగా భావించేవారు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ .నిజంగానే ఆ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చాలా సినిమాలు విజయం సాధించాయి. అందులో `యమలీల` ఒకటి. అలీని హీరోగా చేస్తూ అప్పటి స్టార్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యముడుగా కైకాల సత్యనారాయణ నటించిన ఈ చిత్రంలో చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం పండించిన కామెడీ ఓ రేంజ్ లో పండింది.
ఇంద్రజ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో తనికెళ్ళ భరణి, మంజు భార్గవి, గుండు హనుమంతరావు, కోట శ్రీనివాసరావు, ఏవీయస్, లతాశ్రీ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. సూపర్ స్టార్ కృష్ణ ఓ ప్రత్యేక గీతంలో మెరిసి అలరించారు. నిజానికి ఈ మూవీని మహేష్ తో చేయాలి అనుకున్నారు దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి గారు. కానీ ఆ టైంకి మహేష్ చదువుకుంటున్నాడు, అప్పుడే హీరోగా వద్దు అంటూ కృష్ణ గారు ఆ ఆఫర్ ను తిరస్కరించారు.
నంబర్ 1 మూవీతో హిట్ ఇచ్చి కృష్ణగారు మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కడానికి సహాయ పడ్డారు కృష్ణా రెడ్డి గారు. అలాంటి దర్శకుడు మహేష్ కోసం సినిమా కథ తెస్తే నొ చెప్పాల్సి వచ్చిందని బాధపడి కృష్ణ గారు యమలీల లో స్పెషల్ సాంగ్ లో నటించారు. దాంతో ఈ మూవీని అలీ తో చేశారు కృష్ణారెడ్డి. కానీ సినిమా చాలా బాగా వచ్చింది. 1994వ సంవత్సరం ఏప్రిల్ 28 న విడుదల అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతసారథ్యంలో రూపొందిన సిరులొలికించు, నీ జీనూ ఫ్యాంటు చూసి బుల్లోడో`, వంటి పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి .అయితే ఇదే చిత్రాన్ని హిందీలో వెంకటేష్ ను హీరోగా పెట్టి తగ్ దీర్ వాల గా రీమేక్ చేయించారు డా. డి. రామానాయుడు.వెంకటేష్ రవీనా టాండన్ ను జంటగా నటించిన ఈ మూవీని కె.మురళీ మోహన్ రావు దర్శకత్వం వహించారు. కానీ అక్కడ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.