Ashika Ranganath: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ హీరోయిన్ గురించి ఆసక్తికర విషయాలు..!

‘బింబిసార’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నుండి రాబోతున్న చిత్రం ‘అమిగోస్’. ఇటీవల విడుదల చేసిన టీజర్ చూస్తే ఇదొక వినూత్న కథాంశంతో కూడుకున్న సినిమా అని స్పష్టమవుతుంది. టీజర్ బాగుంది.. సినిమా పై కూడా అంచనాలు పెంచింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 10న ఈ మూవీ విడుదల కాబోతుందని ..

అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. ఈమెకు ఇదే మొదటి చిత్రం. అయితే,అది తెలుగులో మాత్రమే. ఇదిలా ఎందుకు చెబుతున్నాను అంటే ఆల్రెడీ ఈమె వేరే భాషల సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఆషికా రంగనాథ్ కన్నడలో దాదాపు 10 సినిమాల్లో నటించింది. 2022 లో తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా పర్వాలేదు అనిపించిన ఆషికా రంగనాథ్ తెలుగు ప్రేక్షకులను కూడా ‘అమిగోస్’ తో పలకరించనుంది.

మొదటి సినిమాకే ఈమెకు రూ.30 లక్షలు పారితోషికం ఇచ్చారు. డెబ్యూ హీరోయిన్లకు ఇంత పారితోషికం ఇవ్వరు. ఇంత మొత్తం ఈమెకు ఎందుకు ఇచ్చారు అనే అనిపించే వారికి ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ…’ రీమిక్స్ వీడియో సాంగ్ చూస్తే అర్ధమవుతుంది. ఆ సాంగ్లో ఈమె ఎంత గ్లామర్ గా కనిపించిందో చూసే ఉంటారుగా..! ఆషికా రంగనాథ్ స్వతహాగా కన్నడ అమ్మాయే.

ఆమె పుట్టి పెరిగింది కర్ణాటకలోని హసన్ జిల్లాలో.! కాలేజీ రోజుల నుండి ఆమెకు నటన పై ప్రత్యేక ఆసక్తి ఉంది. అందుకే మోడలింగ్ చేసింది. ‘మిస్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు 2014’ రన్నరప్ గా అందాల పోటీల్లో నిలిచింది ఆషిక. అది ఈమె సినీరంగ ప్రవేశానికి ఉపయోగపడింది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus