చేవెళ్ల రవి అంటే ఎవరికీ తెలియదు. బిత్తిరిసత్తి అంటే టక్కున గుర్తుపడతారు. రవి సత్తిగా ఎలా మారాడు?, యాంకరింగ్ లో తనకంటూ ప్రత్యేకతను సాధించడానికి చేసిన కృషి ఏమిటి ? అతని గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర సంగతులు …
1. బిత్తిరిసత్తి సొంతూరు పామెన గ్రామం (రంగారెడ్డి జిల్లా.. చేవెళ్ల మండలం). తల్లిదండ్రులు యాదమ్మ, నర్సింహులు.
2. తండ్రి కావలికారు. చిన్నప్పుడు ప్రతి రోజు తన నాన్నతో కలిసి ఇంటింటికి తిరిగేవాడు. ఆ సమయంలోనే ఇంట్లో రకరకాల మనస్తత్వాలు ఉన్న మనుషుల్ని చూసి వారి హవాభావాలు, మనస్తత్వాలను అర్థం చేసుకొని అనుకరించడం అలవాటు చేసుకున్నాడు.
3. పామెన గ్రామంలోనే 5వ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత చెన్వెల్లిలో టెన్త్ పూర్తి చేసాడు. చేవెళ్లలో ఇంటర్మీడియట్. స్కూల్ అయినా, కాలేజ్ అయినా బిత్తిరిసత్తి తన మాటలతో స్నేహితులను నవ్వించేవాడు. వారు సినిమాలోకి వెళ్లమని చెప్పడంతో హైదరాబాద్ కి వచ్చి స్టూడియోల చుట్టూ తిరిగాడు. అవమానించే వారే తప్ప అవకాశం ఇచ్చేవారు కనిపించ లేదు.
4. బిత్తిరిసత్తి నిరాశతో ఇంటికి చేరినా తపన మాత్రం అలాగే ఉండేది. పెళ్లి చేస్తే దారిలో పడతాడని భావించి తల్లిదండ్రులు సత్తిని ఓ ఇంటివాన్ని చేశారు. కుటుంబ పోషణ కోసం ఓ వైపు వ్యవసాయం చేస్తూనే మరో వైపు
ప్రయత్నాలు కొనసాగించాడు. వచ్చిన చిరు అవకాశాలను వదలలేదు. జీ తెలుగులో వచ్చిన కామెడి క్లబ్ అనే షో పాల్గొని నవ్వులు పూయించాడు.
5. పదిహేనేళ్ల పాటు ప్రయత్నాల అనంతరం 6 టీవీలో నర్సయ్య తాతగా అవకాశం అందుకున్నాడు. తర్వాత వీ6 లో బిత్తిరి సత్తిగా అవతారం ఎత్తాడు. ప్రతి రోజు సమాజంలో జరిగే సంఘటనలకు తన స్టైల్ లో పంచ్ లు ఇస్తూ పేరు తెచ్చుకున్నాడు.