Naga Shaurya, Anusha: నాగశౌర్య భార్య అనూష గురించి ఈ విషయాలు తెలుసా?

టాలీవుడ్‌ మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో ఒకడైన నాగశౌర్య త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ నెల 20న పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇన్నాళ్లూ ప్రేమలో ఉన్నా.. ఎక్కడా కనిపించని, వినిపించని శౌర్య.. ఇప్పుడు తన ‘ప్రేమ’ వివాహం గురించి ప్రకటించాడు. అనూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా అని ప్రకటించాడు. దీంతో ఎవరీ అనూష, ఇక్కడమ్మాయేనా, ఎక్కడమ్మాయి, ఎప్పుడైనా ఇద్దరూ కలసి కనిపించారా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే శౌర్య కాబోయే వైఫ్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.

శౌర్య చెప్పిన అనూష పూర్తి పేరు అనూష ఎన్‌ శెట్టి అంట. కర్ణాటకలో ఆమె ఒక పెద్ద ఇంటీరియర్ కంపెనీకి ఓనర్‌ అట. అనూష డిజైన్స్ పేరుతో బెంగుళూరులో ఆమె ఇంటీరియర్ కంపెనీని నడుపుతున్నారు. విలాసవంతమైన విల్లాలు, అపార్టుమెంట్లు, ఆఫీసులకు ఇంటీరియర్ డిజైనర్ సేవలు అందిస్తూ ఉంటారట. శౌర్య – అనూష మద్య గత కొంతకాలంగా ప్రేమాయణం సాగుతోందట. ఎట్టకేలకు వీరి ప్రేమను, పెళ్లిగా మార్చుకోవాలని పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారట. అంతేకాదు శౌర్య కాబోయే భార్యకు, ఎన్టీఆర్‌ తల్లి షాలినికి మధ్య సంబంధం కూడా ఉందంటున్నారు.

ఎన్టీఆర్ తల్లి కర్ణాటకకు చెందిన మహిళ. మంగుళూరుకు దగ్గరలోని కుందాపూర్ ఆవిడ స్వస్థలం. నాగశౌర్య కాబోయే భార్య అనూష శెట్టిది కూడా అదే ఊరట. ఆ లెక్కన ఎన్టీఆర్ తెలిసిన అమ్మాయినే శౌర్య పెళ్లి చేసుకుంటున్నాడట. ఎన్టీఆర్‌ భార్య ప్రణతి, నాగశౌర్య కూడా మంచి మిత్రులు. గతంలో కొన్ని సందర్భాల్లో ఈ విషయం చెప్పారు కూడా. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ అమ్మమ్మ వాళ్ల ఊరు అమ్మాయినే శౌర్య వివాహం చేసుకోబోతున్నాడు. అన్నట్లు అనూష ఆర్కిటెక్‌గా కర్ణాటక స్టేట్ అవార్డును కూడా అందుకున్నారట. శౌర్యకు, అనూష శెట్టితో బెంగళూరులో పరిచయం అయ్యిందని చెబుతున్నారు.

స్నేహం తర్వాతి రోజుల్లో ప్రేమగా మారిందని సమాచారం. బెంగళూరు విఠల్ మాల్య రోడ్డులోని JW మారియట్ హోటల్‌లో వీరి వివాహం జరగనుంది. నవంబర్ 20న ఉదయం 11.25 గంటలకు ఈ వేడుక జరుగుతుంది. అన్నట్లు శౌర్యది ప్రేమ వివాహమే అని ఆ మధ్య ఆయన తల్లి చెప్పారు. ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా వేడుకలో ఈ మేరకు అన్యాపదేశంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి వైరల్‌ అవుతున్నాయి. ‘‘ఈ తరం యువతకు పెళ్లి విషయంలో స్పష్టత ఉంది. అబ్బాయి పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది. అయినా ఈ కాలం పిల్లలు మాట వింటారా?” అని శౌర్య తల్లి అన్నారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus