విక్టరీ వెంకటేష్ నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘నారప్ప’. ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుంది. ఒరిజినల్ తో పోలిస్తే కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ ను కలిగించింది. అలాగే వెంకటేష్, ప్రియమణి ల నటన కూడా అద్బుతమనే చెప్పాలి.డి.సురేశ్‌బాబు, కలైపులి ఎస్.థాను కలిసి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ‘నారప్ప’ చిన్నకొడుకు సీనప్ప పాత్ర చాలా కీలకమైనది.
ఇతని అమాయకత్వం వల్లనే సినిమా కథ మొత్తం నడుస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ కి ఎక్కువ … పెద్ద నటుడికి తక్కువ అన్నట్టు ఇతని పాత్ర ఉంటుంది.కళ్ళముందే తన అన్నని చంపిన వాళ్ళ పై ప్రతీకారం తీర్చుకునే తమ్ముడిగా సీనప్ప పాత్ర ఉంటుంది. ఇక ఈ పాత్ర చేసిన ఆర్టిస్ట్ పేరు రాఖీ. ఇతని పూర్తి పేరు గీతా కృష్ణ.. ముద్దుగా రాఖీ అని పిలుస్తారు. ఈ మధ్యనే ఇతను ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాడు. నిజానికి ఈ సినిమా కంటే ముందే ఇతను ‘రంగస్థలం’ మూవీలో ఓ చిన్న పాత్ర పోషించాడట.
అటు తర్వాత ఇంకా కొన్ని సినిమాల్లో నటించగా… ఇతని పాత్ర ఎడిటింగ్ లో లేపేసినట్టు తెలిపాడు.తన అన్నయ్య కారణంగా ‘నారప్ప’ అవకాశం వచ్చినట్టు ఇతను ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, హీరో వెంకటేష్ లు ఇతనికి బాగా సపోర్ట్ చేసినట్టు కూడా చెప్పుకొచ్చాడు.