Nayanthara Sister: ‘గాడ్ ఫాదర్’ లో నయన్ చెల్లిగా కనిపించిన బ్యూటీ గురించి షాకింగ్ విషయాలు…!

ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ రిలీజ్ అయ్యింది. మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్ గా తెరకెక్కింది ఈ మూవీ. అక్టోబర్ 5న దసరా కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ అయితే రాబట్టలేకపోతుంది. మెగాస్టార్ కెరీర్లో ఈ మూవీ మరో కమర్షియల్ డిజాస్టర్ గా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. ఈ మూవీలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నయనతార నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు కూడా చెల్లి ఉంటుంది. జాన్వీ అనే పాత్రలో ఈమె కనిపిస్తుంది. విలన్ సత్యదేవ్ కారణంగా డ్రగ్స్ కు బానిసైపోయి, అతను లైంగిక దాడి చేస్తుంటే ఏమీ చేయలేక సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటుంది ఈ పాత్ర. ఈ పాత్రలో కనిపించిననటి మరెవరో కాదు తాన్యా రవిచంద్రన్. కోలీవుడ్ సీనియర్ నటుడు రవిచంద్రన్ మనవరాలు ఈమె.

2016లో ‘బల్లే వెళ్లేయితేవా’ అనే చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. అక్కడ ఆల్రెడీ 4 సినిమాల్లో నటించింది ఈమె. ఇక 2021 లో కార్తికేయ హీరోగా నటించిన ‘రాజా విక్రమార్క’ చిత్రంతో ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడం వల్ల ఈమెకు పేరు రాలేదు కానీ ఈమె కూడా మంచి నటే. అందం,అభినయం కలిగిన ఈ బ్యూటీ బాగా డబ్బున్న అమ్మాయి కూడా..! ఈమె వ్యాపార రంగంలో కూడా బాగా రాణిస్తుంది.

ఏక కాలంలో ఒక డీల్ చేస్తే దాని విలువ రూ.10,000 కోట్లు ఉంటుందట. కానీ సినిమాల పై ఇంట్రెస్ట్ తో ఇటు వైపు అడుగుపెట్టింది. డబ్బు కోసం ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయను అంటుంది ఈ నటి. తన మనసుకు నచ్చిన పాత్రలే చేస్తుందట.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus