ప్రియాంక చోప్రా (Priyanka Chopra) పేరు ఈ మధ్య మళ్ళీ మార్మోగుతుంది. అందుకు ఒక కారణం.. ‘మహేష్ (Mahesh Babu) – రాజమౌళి (S. S. Rajamouli) సినిమాల్లో ఈమె నటిస్తుంది’ అంటూ ప్రచారం జరగడం. ఫోటోలు కూడా సోషల్ మీడియాలో సందడి చేయడం అయితే..! మరొకటి ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా, హీరోయిన్ నీలమ్ ఉపాధ్యాయ తో (Neelam Upadhyaya) పెళ్లి కుదరడం అని చెప్పాలి. ఈ వార్తలతో ప్రియాంక హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఈమెకు కాబోయే మరదలు నీలమ్ గురించి జనాలకి ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు.
సిద్ధార్థ్ చోప్రా, నీలమ్ ఉపాధ్యాయ ఓ డేటింగ్ యాప్లో కలుసుకుని.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోబోతున్నారు. నీలమ్ గురించి చెప్పాలంటే చాలా మంది ఇదొక్కటే చెబుతారు. కానీ ఈమె కూడా టాలీవుడ్ హీరోయిన్ అని ఎక్కువ మందికి తెలియదు. వాస్తవానికి నీలమ్ ఉపాధ్యాయ ముంబైకి చెందిన అమ్మాయే. కానీ ఆమె తెలుగు సినిమాల్లో కూడా నటించింది.
ఎస్వీ రంగారావు మనవడు జూనియర్ ఎస్వీ రంగారావు హీరోగా ‘మిస్టర్ 7’ అనే సినిమా వచ్చింది. ఇందులో నీలమ్ ఉపాధ్యాయ హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా ఆడకపోవడంతో.. వీళ్ళు ఎక్కువ పాపులర్ కాలేదు. ఆ తర్వాత కూడా అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘యాక్షన్ 3D’ (Action 3D) అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. దీనికి నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) దర్శకత్వం వహించడం విశేషంగా చెప్పుకోవాలి. అంతే కాదు..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకు వరస అయినటువంటి నారా రోహిత్ (Nara Rohit).. హీరోగా చాలా సినిమాల్లో నటించాడు. అందులో ‘పండగలా వచ్చాడు’ అనే సినిమా ఒకటి. ఇందులో రోహిత్ సరసన నీలమ్ ఉపాధ్యాయ హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. 2018లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. దానికి కారణాలు బయటకు రాలేదు. అలాగే నీలమ్ ఉపాధ్యాయ హీరోయిన్ గా నటించిన మరో సినిమా కూడా రిలీజ్ కాలేదట. అదీ సంగతి.