పవన్ కళ్యాణ్- రానా… కాంబినేషన్లో రూపొందుతోన్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ సాగర్ చంద్ర దర్శకత్వంలో ‘భీమ్లా నాయక్’ గా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే మూడు పాటలు విడుదలై సూపర్ హిట్ అవ్వగా తాజాగా ‘అడవి తల్లి మాట’ అనే చిత్రం కూడా విడుదలైంది. ఈ పాటని కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి అద్భుతంగా పాడారు.
మరీ ముఖ్యంగా దుర్గవ్వ వాయిస్ చాలా బాగా కుదిరింది. దాంతో ఈమె బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవాలని ప్రేక్షకులు వెతుకులాట మొదలుపెట్టారు. దుర్గవ్వ… తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తి. ఈమె పెద్దగా చదువుకోలేదు.పేద కుటుంబంలో పుట్టిన మహిళ కాబట్టి పొలం పనులకు వెళ్తూ జానపదాల పాటలను పాడడం అలవాటు చేసుకుంది. తెలుగుతో పాటు మరాఠీలో కూడా ఎన్నో జానపద పాటలను పాడేది. ఈ క్రమంలో ఆమె పాడిన..
‘ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే’, ‘సిరిసిల్ల చిన్నది’ వంటి పాటలు బాగా క్లిక్ అయ్యాయి.దీంతో ‘భీమ్లా నాయక్’ లో ఈమెకు ‘అడవి తల్లి’ పాట పాడే అవకాశం లభించింది. ఈ పాట సూపర్ హిట్ అవ్వడం… యూట్యూబ్లో ట్రెండింగ్ లో ఉండడంతో ఇప్పుడు దుర్గవ్వకి మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలుస్తుంది.