సూర్య తన కెరీర్‌లో పీక్ స్టేజ్‌లో ఉన్నారు. ఇది వసూళ్ల పరంగానో, ఫేమ్ పరంగానో చూసి చెప్పడం లేదు. పర్‌ఫార్మెన్స్ పరంగా చూసి చెబుతున్నమాట ఇది. మొన్నీ మధ్య ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో చేసిన పర్‌ఫార్మెన్స్ మరచిపోక ముందే… ‘జైభీమ్’లో మరపురాని నటనను ప్రదర్శించాడు. ‘జైభీమ్’ అనే పేరు ఎక్కడైనా వినిపిస్తే… ‘సూర్య సూపర్‌గా చేశాడు’ అంటూ మెచ్చేసుకుంటున్నారు అందరూ. ఇది రీల్… మరి రియల్ ‘జైభీమ్’ ఎవరు? ఇదిగో ఈయనే. తమిళనాడులో 90వ దశకంలో జరిగిన ఒక లాకప్ డెత్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన ప్రశంసలు అందుకుంటున్నారు జ్ఞానవేల్.
ముందు చెప్పినట్లు తెర మీద సూర్య హీరో… రియల్ హీరో అయితే చంద్రు. సూర్య పోషించింది ఆయన పాత్రనే. గిరిజన యువకుడి లాకప్ డెత్ గురించి తెలుసుకుని కదిలిపోయి అతడికి, తన కుటుంబానికి న్యాయం చేయడానికి చంద్రు చేసిన పోరాటమే ‘జైభీమ్’. చంద్రు గొప్పతనం ఈ ఒక్క కేసుకు పరిమితం కాలేదు. న్యాయవాద వృత్తిలో ఉండగా వాదించిన ఏ మానవ హక్కుల కేసుకూ చంద్రు ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదట. వెనుకబడిన వర్గాల వారి కోసం, గిరిజనుల కోసం వాదించిన కేసులకు ఏ రోజూ డబ్బులు తీసుకోలేదట.
ఆ తర్వాత చంద్రు జడ్జి కూడా అయ్యారు. ఆ ఉన్నత పదవిలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు చంద్రు. న్యాయస్థానంలో జడ్జిని ఉద్దేశించి ‘మై లార్డ్’ అని సంబోధించడాన్ని తన వరకు నివారించారు చంద్రు. జడ్జిగా ఆరేళ్లలో 96 వేలకు పైగా కేసులను పరిష్కరించారు. ఆ రోజుల్లో అదో రికార్డట. ఈ క్రమంలో ఆయన ఎన్నో చరిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చారు. మహిళలు దేవాలయాల్లో పూజారులుగా వ్యవహరించడం, కులం ఏదైనా అందరికీ ఒకే శ్మశానం ఉండాలి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అంతేకాదు పదవీ విరమణకు ముందు, తర్వాత తన ఆస్తులను ప్రకటించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!