Roja: అన్ స్టాపబుల్ షో సీజన్2 అతిథులు వీళ్లేనా?

స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్2 అంచనాలకు మించి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ షో తొలి ఎపిసోడ్ కు చంద్రబాబు హాజరు కాగా తొలి ఎపిసోడ్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అటు పొలిటికల్ వర్గాల్లో ఇటు సినీ వర్గాల్లో ఈ ఎపిసోడ్ సంచలనం అయింది. అయితే బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్2 కు రోజా గెస్ట్ గా హాజరు కానున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ, రోజా వేర్వేరు పార్టీలలో ఉన్నారు. బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా పొలిటికల్ కెరీర్ ను కొనసాగిస్తుంటే రోజా వైసీపీ మంత్రిగా ఉన్నారు. బాలయ్య షోకు రోజా హాజరైతే ఆ ఎపిసోడ్ పై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అన్ స్టాపబుల్ సీజన్2 కు చిరంజీవి, వెంకటేష్ హాజరయ్యే అవకాశాలు ఉండగా యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే బాలయ్య షోకు రోజా రావడానికి ఆసక్తి చూపినా వైసీపీ నుంచి అనుమతులు దక్కుతాయో లేదో చూడాల్సి ఉంది.

ఈ షోలో రాజకీయాలకు సంబంధించి నెగిటివ్ కామెంట్లు చేస్తే రోజా పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడే ఛాన్స్ కూడా ఉంది. బాలయ్యపై రోజాకు ప్రత్యేక అభిమానం ఉన్న నేపథ్యంలో ఆమె ఏం చేస్తారో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. మరోవైపు బాలయ్య ఈ షోకు పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

అన్ స్టాపబుల్ సీజన్2 ఫస్ట్ సీజన్ ను మించి సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే. మరోవైపు బాలయ్య వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus