Upasana: పెళ్ళి వేడుకలో ట్రాన్స్ జెండర్ తో ఉపాసన..ఫోటోలు వైరల్..!

  • December 3, 2021 / 04:11 PM IST

కొణిదెల వారి ఇంటికోడలు రాంచరణ్ సతీమణి అయిన ఉపాసన…తన సేవా గుణంతో అందరినీ ఆకట్టుకుని ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. ఓ వైపు మెగాస్టార్ ఇంటి కోడలిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే మరోపక్క అపోలో వైస్ చైర్మెన్ గా వ్యవహరిస్తూ వస్తోంది ఉపాసన.అంతేకాదు చరణ్ బిజినెస్ లకు సంబంధించిన వ్యవహారాలను కూడా ఆమెనే చూసుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ తన భర్తకి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా సామాజిక అంశాల పై స్పందించడం అలాగే హెల్త్ టిప్స్ ఇవ్వడం వంటివి కూడా చేస్తుంటుంది ఉపాసన.

ఇదిలా ఉండగా.. తాజాగా ఉపాసన ట్రాన్స్‌జెండర్స్‌తో దిగిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. తన సోదరి వివాహ వేడుకల్లో భాగంగా… ట్రాన్స్‌జెండర్స్‌తో ఉపాసన కాసేపు టైం స్పెండ్ చేసింది.ఆమె బెస్ట్ ఫ్రెండ్ కూడా ఓ ట్రాన్స్ జెండర్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో “ఆశీర్వాదాలు తీసుకోవడం అంటే మానవత్వం, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి గల సరైన అవకాశం. అనుష్ పాల్ వివాహ వేడుకలను ఎంతో ఆప్యాయంగా ప్రారంభించినందుకు లక్ష్మీనారాయణ త్రిపాఠికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

జీవితాన్ని సంపూర్ణంగా ఎలా జీవించాలి అనేది మీరు నాకు నేర్పిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సమాజాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. అది తరతరాల నుండీ వస్తున్న సంప్రదాయం . హైదరాబాద్ లో ఉన్న 6 బదాయి గృహాల ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడం నాకు సంతోషంగా అనిపిస్తుంది. జీవితాన్ని వర్ణించడానికి వాళ్ళ దగ్గర గొప్ప కథలు ఉన్నాయి. వారితో సన్నిహితంగా మెలుగుతుండడం, సంభాషిస్తుండడం అనేది నా అదృష్టంగా భవిస్తూ సంతోషిస్తున్నాను” అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus