Upasana: ఆ కారణంతోనే ఉపాసన ఇల్లు అద్దెకు తీసుకుందా?

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంచి సక్సెస్ సాధించారు. ఇలా మెగా కోడలిగా ప్రముఖ వ్యాపారవేత్తగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఉపాసన తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఒక ఖరీదైన బంగ్లాను అద్దెకు తీసుకున్నారని తెలుస్తుంది. ఇలా కొన్ని నెలల పాటు ఉపాసన ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నారంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

అసలు ఉపాసన లాస్ ఏంజెల్స్ లో ఇంటిని అద్దెకు తీసుకోవడం ఏంటి అంటూ పలువులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమె అక్కడ ఇంటిని అద్దెకు తీసుకోవడానికి ఓ కారణం ఉందని తెలుస్తుంది.రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడంతో గత కొద్దిరోజులుగా ఈయన అమెరికాలోనే ఉన్నారు. ఈ విధంగా రాంచరణ్ అమెరికాలో ఉండడంతో ఉపాసన కూడా అమెరికా వెళ్లారు.

అయితే ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఆమెకు సౌకర్యవంతంగా ఉండడం కోసం ఏకంగా లాస్ ఏంజెల్స్ లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారని తెలుస్తుంది. ఇక ఇదే ఇంట్లోనే రామ్ చరణ్ ఉపాసన నివసిస్తున్నట్లు సమాచారం. ఇక ఆస్కార్ వేడుకలలో పాల్గొన్న చిత్ర బృందం మొత్తం తిరిగి ఇండియా వచ్చిన రామ్ చరణ్ ఉపాసన మాత్రం మరి కొద్ది రోజులు అమెరికాలోనే ఉండబోతున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం ఉపాసన ఆరు నెలల ప్రెగ్నెంట్ కావడంతో తన వైద్య పరీక్షల నిమిత్తం కొద్దిరోజుల పాటు అమెరికాలోనే ఉండనున్నారట దీంతో ఈమె హోటల్లో ఉండడం కన్నా ఇంట్లో ఉండడమే మంచిదని భావించి ఇంటిని అద్దెకు తీసుకున్నారని తెలుస్తుంది. అలాగే తనకు అక్కడ తోడు ఉండడం కోసం ఏకంగా ముగ్గురు సిబ్బందిని ఇండియా నుంచి తీసుకెళ్లారని తెలుస్తోంది.ఇలా ఉపాసన లాస్ ఏంజెల్స్ లో ఇంటిని అద్దెకు తీసుకోవడం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus