Upasana: ప్రెగ్నెన్సీ గురించి ఎవరూ ఊహించని విషయం చెప్పిన ఉపాసన!

మరో రెండు నెలల్లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన సోషల్ మీడియా ద్వారా ఎన్నో కీలక విషయాలను పంచుకుంటున్నారు. అదే సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఉపాసన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెళ్లికి ముందే చరణ్ తో పరిచయం ఉందని చరణ్, నేను మంచి ఫ్రెండ్స్ అని ఉపాసన చెప్పుకొచ్చారు. చరణ్, నేను పెళ్లి సమయంలోనే పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలనే విషయానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నామని ఉపాసన వెల్లడించారు.

ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాతే పిల్లల్ని కనాలని భావించడం జరిగిందని ప్రస్తుత ఆర్థికంగా సెటిల్ అయ్యామని ఆమె చెప్పుకొచ్చారు. పెళ్లైన కొత్తలోనే ఎగ్స్ ను ఫ్రీజ్ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ పని చేశానని ఉపాసన చెప్పుకొచ్చారు. చరణ్ నేను పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. జీవితంలో సంపాదన తర్వాతే పిల్లలకు వెల్ కమ్ చెప్పాలని భావించామని ఉపాసన అన్నారు.

ప్రస్తుతం మా సంపాదనతో పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలనని నమ్మకం ఉందని (Upasana) ఉపాసన పేర్కొన్నారు. ఉపాసన వెల్లడించిన రహస్యాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. రామ్ చరణ్ విషయానికి వస్తే చరణ్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా వరుస విజయాలను సొంతం చేసుకునేలా చరణ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ షూట్ ఈ ఏడాదే మొదలుకానుందని సమాచారం అందుతోంది. చరణ్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా సినిమా సినిమాకు చరణ్ కు క్రేజ్ పెరుగుతోంది. ఇతర ఇండస్ట్రీలలో కూడా రామ్ చరణ్ సత్తా చాటుతున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus