Upasana: మీరు పూర్తి వీడియో చూసిన తరువాత ఓ నిర్ణయానికి రావాలి!

మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్ తాను ప్రేమించిన అమ్మాయి ఉపాసనను పెళ్లి చేసుకుని పది సంవత్సరాలు పూర్తి అయింది. ఉపాసన రాంచరణ్ కు సరైన భార్యగా మెగా ఇంటి కోడలిగా ఒకవైపు బాధ్యతలను చెక్క పెట్టడమే కాకుండా మరోవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్ దంపతుల వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతున్నప్పటికీ పిల్లలు లేరు అనే వెలితి మాత్రం అలాగే ఉండిపోయింది.

ఈ దంపతులు పెళ్లి జరిగి పది సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా పిల్లల గురించి ఆలోచించకపోవడం గమనార్హం. ఇకపోతే తాజాగా సద్గురుతో ఉపాసన ఓ సమావేశంలో భాగంగా మాట్లాడుతూ నేను నా లైఫ్ లో ఎంతో సంతోషంగా ఉన్నాను అయినా నన్ను ప్రతి ఒక్కరూ పిల్లల గురించి ప్రశ్నిస్తున్నారు ఎందుకు అని అడిగారు. ఈ క్రమంలోనే సద్గురు సమాధానం చెబుతూ ప్రజెంట్ జనరేషన్ కి పిల్లలు అవసరం లేదని అలా పిల్లలు వద్దనుకున్న వారికి తాను బహుమానం ఇస్తానని చెప్పారు.

ఈ క్రమంలోనే సద్గురు సమాధానం చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు జనాభా తగ్గించడం కోసమే రామ్ చరణ్ దంపతులు పిల్లలని వద్దనుకుంటున్నారా..అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేయడంతో ఈ కామెంట్లపై ఉపాసన స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఉపాసన స్పందిస్తూ ఓ మై గాడ్ పిల్లల గురించి మీకు అలా అర్థమైందా..ముందు మీరు పూర్తి వీడియో చూసి ఓ నిర్ణయానికి రండి అంటూ తెలిపారు.

సద్గురు వీడియోతో పాటు తర్వాత నేను చేసిన పోస్ట్ కూడా చదివి ఉండాల్సింది అంటూ ఈమె పిల్లల పట్ల వారి ఆలోచనల గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.ఇక సద్గురు పిల్లలు వద్దనుకున్న వారికి తాను బహుమానం ఇస్తానని చెప్పగా ఉపాసన తను ఇచ్చే బహుమతి తీసుకోవడానికి తన తాతయ్య ఒప్పుకోవడం లేదు అంటూ తెలియచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఉపాసన బహుమతి వద్దు అంటే పిల్లలు కావాలని అర్థం కదా అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus