Upasana: ఆ కామెంట్ల వల్ల ఫీలైన ఉపాసన.. ఏం జరిగిందంటే?

రామ్ చరణ్ భార్యగా, బిజినెస్ ఉమన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే. త్వరలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. తన ప్రవర్తనతో మెగా ఫ్యామిలీ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్న ఉపాసనకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉపాసన సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసినా ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఉపాసన తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్ల గురించి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

చాలామంది నేను గోల్డెన్ స్పూన్ తో పుట్టానని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని అయితే తన తల్లీదండ్రులు ఎంతో కష్టపడ్డారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను రెస్ట్ లేకుండా వృత్తిపరమైన బాధ్యతలతో బిజీగా ఉన్నానని ఉపాసన చెప్పుకొచ్చారు. నా గురించి నెగిటివ్ గా రాయవద్దని మీడియాను ఆమె కోరారు. నా పిల్లల్ని సైతం నిరంతర వృత్తిపరమైన బాధ్యతలతో నేను పెంచుతానని ఉపాసన చెప్పుకొచ్చారు. ఉపాసన చెప్పిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

చాలా విషయాలలో ఉపాసన ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇతరులకు సహాయం చేసే విషయంలో సైతం ఉపాసన ముందువరసలో ఉంటారు. ఉపాసన చరణ్ లైఫ్ లోకి వచ్చాక చరణ్ సక్సెస్ రేట్ పెరిగిందని కొంతమంది చెబుతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుండగా చరణ్ రెండు పాత్రల్లో ఈ సినిమాలో కనిపిస్తున్నారు.

శ్రీకాంత్, ఎస్.జే సూర్య ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. శంకర్ మార్క్ మెసేజ్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని ఈ మూవీతో శంకర్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని అభిమానులు భావిస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus