బాక్సాఫీస్ సందడి: రొమాంటిక్ vs వరుడు కావలెను!

దసరా కానుకగా కాస్త పేరున్న సినిమాలు థియేటర్లో విడుదల కాగా.. ఆ తరువాత చిన్న సినిమాలు క్యూ కట్టాయి. కరోనాకారణంగా వాయిదా పడుతూ వస్తోన్న సినిమాలు ఎట్టకేలకు థియేటర్లో విడుదలవుతున్నాయి. ఈ వారం కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కొన్నేమో ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!

రొమాంటిక్:

ఆకాష్ పూరి, కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా మొదలై రెండేళ్లు అవుతోంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ట్రైలర్ ను చూస్తుంటే మాత్రం యూత్ కి కనెక్ట్ అయ్యేలా సినిమాను తెరకెక్కించారనిపిస్తుంది.

వరుడు కావలెను:

నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య అనే లేడీ డైరెక్టర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాను అక్టోబర్ 29న విడుదల చేయబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో నదియా, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు.

తీరం:

అనిల్ హీరోగా నటిస్తూ.. డైరెక్ట్ చేసిన సినిమా ‘తీరం’. ఇందులో శ్రావణ్ అనే మరో హీరో కూడా నటించాడు. క్రిస్టెన్‌ రవళి, అపర్ణ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ సినిమాను కూడా ఈ నెల 29న విడుదల చేయబోతున్నారు. రెండు జంటల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. యం.శ్రీనివాసులు నిర్మాతగా వ్యవహరించారు.

రావణ లంక:

క్రిష్‌ బండిపల్లి, అస్మిత కౌర్‌ జంటగా నటించిన ‘రావణ లంక’ సినిమాను బి.ఎన్‌.ఎస్‌.రాజు డైరెక్ట్ చేశారు. ఇందులో మురళీశర్మ కీలకపాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను అక్టోబర్ 29న విడుదల చేయబోతున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus