Balayya Babu: బాలయ్య మూవీతో సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా?

  • April 29, 2022 / 08:11 PM IST

స్టార్ హీరో బాలకృష్ణ తన సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. పాత్ర ఏదైనా తన నటనతో పూర్తిస్థాయిలో న్యాయం చేసే హీరోలలో బాలకృష్ణ ఒకరు. డైరెక్టర్ల హీరోగా బాలకృష్ణ పేరు తెచ్చుకోవడంతో పాటు నిర్మాతలపై బాలయ్య భారం పెంచరని కథలో వేలు పెట్టరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. గతేడాది అఖండ సినిమాతో బాలయ్య మరో కమర్షియల్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Click Here To Watch NOW

ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో బాలయ్య బిజీగా ఉండగా ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. అయితే బాలయ్య ఒక పాత్రలో నెగిటివ్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది. వైరల్ అవుతున్న వార్తలు ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. అయితే దర్శకుడు స్పందిస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

బాలయ్య 23 సంవత్సరాల క్రితం సుల్తాన్ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించి మెప్పించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఈ సినిమాతో బాలకృష్ణ ఆ ఫ్లాప్ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేస్తారని ఫ్యాన్స్ బావిస్తున్నారు. బాలయ్యకు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉంది. జూన్ నెల 10వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కానుందని సమాచారం అందుతోంది.

ఈ సినిమాకు సంబంధించి వేర్వేరు టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే మేకర్స్ కన్ఫామ్ చేస్తే మాత్రమే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus