ఉపేంద్ర (Upendra) హీరోగా తెరకెక్కిన ‘యు ఐ'(UI) (UI The Movie) చిత్రం డిసెంబర్ 20న విడుదల కాబోతుంది. ఈ సినిమాకు దర్శకుడు కూడా ఉపేంద్రనే కావడం విశేషం. ఇది దర్శకుడిగా అతనికి 10వ సినిమా అట. అతను హీరోగా నటించే సినిమాలే కాదు, డైరెక్ట్ చేసే సినిమాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ‘ష్’ అనే టైటిల్ పెట్టడం, అసలు టైటిలే పెట్టకుండా ‘మీరే పెట్టండి’ అంటూ ప్రమోషన్ చేయడం, డైలాగులు లేకుండా సినిమాను విడుదల చేయడం..
ఇలా వింత వింతగా చేసి పబ్లిసిటీ తెచ్చుకుంటాడు ఉపేంద్ర. తాజాగా వస్తున్న ‘యు ఐ’ విషయంలో కూడా అలాంటి పద్ధతినే ఫాలో అవుతున్నాడు. ఈ సినిమా రెండు రకాల వెర్షన్లతో రిలీజ్ అవుతుందట. ఒక థియేటర్లో ప్రదర్శించబడే వెర్షన్ ఇంకో థియేటర్లో ప్రదర్శించబడదట. టీజర్ కూడా రకరకాలుగా ఉంది. ఏదేమైనా ఇలాంటి ఐడియాలో ‘ఉపేంద్ర’ స్పెషల్ గా నిలబెట్టాయి. స్టార్ ని చేశాయి.
ఇలా డిఫరెంట్ గా ఆలోచించడం మీకు మాత్రమే సాధ్యం అని ఉపేంద్రకి చెబితే.. నేను మాత్రమే రెగ్యులర్ గా ఆలోచిస్తానేమో అని నాకు అనిపిస్తుంది అంటూ సమాధానం చెబుతారు ఉపేంద్ర. ఇక అతను హీరోగా, డైరెక్టర్ గా చేసిన ‘A’ సినిమా గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు ‘ఉపేంద్ర’.
ఆ సినిమాని రూ.70 లక్షల బడ్జెట్లో తీశాడట. అంత బడ్జెట్లో సినిమా తీయడమే ఒక ఎచీవ్మెంట్ గా ఫీలయ్యాడట ‘ఉపేంద్ర’. అయితే ఆ సినిమాని డిస్ట్రిబ్యూటర్స్ తీసుకోము అని చెప్పారట. ‘ఇదేం సినిమా. ఇది రిలీజ్ అయినా… ఒక్క రోజు కూడా ఆడదు’ అంటూ విమర్శించారట. కానీ అతని నమ్మకమే నిజమైంది. సినిమా మంచి సక్సెస్ అందుకుంది.