కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra-Rao) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఉపేంద్ర కొన్ని తెలుగు సినిమాలలో సైతం మెప్పించారు. పేద కుటుంబంలో జన్మించిన ఉపేంద్ర బాల్యంలో ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు అవమానాలు ఎదురయ్యాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఉపేంద్ర ఒక సినిమాతో బిజీగా ఉండగా యూఐ : ది మూవీ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లోకి వచ్చిన సమయంలో తాను ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని ఆ సమయంలో ప్లేట్ తీసుకుని భోజనానికి వెళ్లగా ప్రొడక్షన్ కు చెందిన వ్యక్తి నాకు ఆహారం పెట్టలేదని ఉపేంద్ర వెల్లడించారు. భోజనం కోసం వెళ్తే నాకు దారుణమైన అవమానం ఎదురైందని ఆయన చెప్పుకొచ్చారు.
నాకు ఎలాంటి గుర్తింపు లేకపోవడం వల్లే ఆ సమయంలో అవమానం ఎదురైందని ఉపేంద్ర చెప్పుకొచ్చారు. తర్వాత రోజుల్లో నేను హీరోగా మారిన తర్వాత నన్ను అవమానించిన ఆ వ్యక్తి నా ప్లేట్ లో భోజనం వడ్డించాడని ఉపేంద్ర అన్నారు. కెరీర్ తొలినాళ్లతో నాతో ఏం లేదని జీరోతో నా ప్రయాణం మొదలైందని ఆయన వెల్లడించారు. .
నేను ఇప్పుడు ఏమైనా కోల్పోయినా నాకు నష్టం లేదని ఎందుకంటే ఇంతకు ముందు కూడా నాతో ఏం లేదని ఉపేంద్ర అభిప్రాయపడ్డారు. ఉపేంద్ర వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఉపేంద్ర యూఐ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. ఉపేంద్ర రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.