మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా ఫిబ్రవరి 12వ తేదిన ప్రేమికుల రోజు కంటే ముందే ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఇక రీసంట్ గా ట్రైలర్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ముందే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లో కొన్ని విషయాలు చెప్పకనే చెప్పేశాడు దర్శకుడు బుచ్చిబాబు. దేవుడే వరాలు ఇస్తాడని నాకు అర్ధమైంది. ఎవరికి పుట్టామో అందరికీ తెలుస్తుంది.. కానీ, ఎవరికోసం పుట్టామో నాకు చిన్నప్పుడే తెలిసిపోయింది అని హీరో చెప్పే డైలాగ్స్, సముద్రం ఆకాశం కలుస్తాయా.. మరి ఆకాశమే వంగితే అనే డైలాగ్స్ ఇలా కొన్ని డైలాగ్స్ లో అసలు సినిమా ఏంటి అనేది క్లియర్ గా ఆడియన్ కి అర్ధమైంది కూడా.
హీరో వైష్ణవ్ తేజ్ హీరోయిన్ కృతిని చిన్నప్పుటి నుంచి ఘాడంగా ప్రేమిస్తాడని, అందుకు కృతి వాళ్ల నాన్న అయిన విజయ్ సేతుపతి అడ్డుగా విలన్ గా నిలుస్తాడని తెలిసిపోతోంది. అయితే సినిమాకి క్లైమాక్స్ ఏంటి అనేది మాత్రం రివీల్ అవ్వట్లేదు. ఈ ఒక్కరాత్రే 80 సంవత్సరాల వరకూ గుర్తుండిపోయేలా బతికేద్దాం అంటూ హీరోయిన్ చెప్తుంటే హీరో హీరోయిన్స్ కమిట్ అయినట్లుగానే కనిపిస్తోంది. అయితే ఇది చివరకి ఎలా మారింది..? క్లైమాక్స్ లో హీరో చనిపోయాడా.. హీరోయిన్ చనిపోయిందా.. అసలు ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు సోషల్ మీడియాలో ఉప్పెన సినిమా ట్రాజెడీ ఎండింగ్ అంటూ కొంతమంది స్టోరీని లీక్ చేస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్ ని బట్టీ చూస్తే హీరో చచ్చిపోతే సినిమా హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా అని పోల్స్ కూడా పెట్టేస్తున్నారు చాలామంది.
అయితే, ఇలాంటి ప్రేమ కథలో హీరో – హీరోయిన్ క్లైమాక్స్ లో ఇద్దరూ చచ్చిపోతే సినిమా ఎలా ఉంటుంది..? అది ఇప్పటి జనరేషన్ ఎలా రిసీవ్ చేస్కుంటారు అనేది ఆసక్తికరం. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అబ్జర్వ్ చేసినట్లయితే మెగాస్టార్ చిరంజీవి 1980ల్లో డైరెక్టర్ భారతీరాజా నాకు గుర్తుకు వచ్చారని చెప్పాడు. దీన్ని బట్టీ చూస్తే ఈ సినిమా సీతాకోకచిలుక సినిమాకి దగ్గరగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే మెగాస్టార్ హింట్ ఇచ్చారా అని కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, క్లైమాక్స్ చాలామంది కన్విన్స్ అవుతారా లేరా అనేది కూడా చూడాలి అని హింట్స్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. మరి ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.