ఇదివరకు ఓవర్సీస్ మిలియన్లకు మిలియన్ల డాలర్లను వసూల్ చేసే తెలుగు సినిమాలు.. కరోనా లాక్ డౌన్ తరువాత పూర్తిగా డౌన్ అయిపోయాయి. బహుశా తక్కువ రోజులకే డిజిటల్ రిలీజ్ లు ఇచ్చేస్తారని తెలియడం వలనో లేక ఇంకా అక్కడ కరోనా భయం తగ్గకపోవడం వలనో కానీ… ఈ మధ్యన విడుదలైన సౌత్ సినిమాలకు ఓవర్సీస్ మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రావడంలేదు. ఒక్క ‘ఆర్.ఆర్.ఆర్’ ను పక్కన పెడితే ‘వకీల్ సాబ్’ ‘ఆచార్య’ వంటి పెద్ద సినిమాలకు కూడా ఓవర్సీస్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగడం లేదని వినికిడి.
పెద్ద సినిమా విడుదలయ్యి అక్కడ సూపర్ హిట్ అయితేనే తప్ప ఓవర్సీస్ మార్కెట్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ ‘ఉప్పెన’ అనే చిన్న సినిమా ఓవర్సీస్ మార్కెట్ కు తిరిగి ఊపు తీసుకొచ్చేలా ఉండడం విశేషం. వివరాల్లోకి వెళితే.. ఒక్క అమెరికాలోనే ‘ఉప్పెన’ చిత్రం 80 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ కాబోతుందట. ఇక ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ కలిపి 110 లోకేషన్స్ లో ఈ చిత్రం విడుదలయ్యేందుకు రెడీ అయ్యిందని సమాచారం.
ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందట. అంటే ఒక్క ఓవర్సీస్ లోనే ఈ చిత్రం 200 లోకేషన్స్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతుందన్న మాట. సినిమాకి హిట్ టాక్ వచ్చి.. జనాలు కనుక రావడం మొదలుపెడితే.. కనీసం ఈ చిత్రం అక్కడ $500 మిలియన్ డాలర్లను వసూల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిత్రం హిట్ అవ్వడం తెలుగు సినిమాకి చాలా కీలకమనే చెప్పాలి..!