టాలీవుడ్ లో చాలా గ్యాప్ తరువాత విడుదలవుతున్న సినిమాల్లో ఉప్పెన ఒకటి. గత ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ , మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ముందు ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్స్ చాలానే వచ్చాయి. కానీ నిర్మాతలు హీరో వైష్ణవ్ తేజ్ కెరీర్ మొదటి సినిమా కాబట్టి థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు ఎదురుచూశారు. ఇక సినిమా అవుట్ రేట్, రెండు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం చాలా మంది ప్రయత్నాలు చేశారట. ముఖ్యంగా ఒక బయ్యర్ అయితే దాదాపు 18కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు సమాచారం. కానీ నిర్మాతలు ఆ ఆఫర్ కు కూడా ఒప్పుకోలేదట. నిజానికి సినిమాకు అది మంచి ఆఫర్ అనే చెప్పాలి.
అయితే ఆ ఆఫర్ ను ఒప్పుకోకపోవడానికి మరొక కారణం కూడా ఉందట. ముందుగానే నిర్మాతలు బిజినెస్ డీలింగ్స్ ను క్లోజ్ చేసుకున్నారని టాక్. ముఖ్యంగా నైజాం హక్కులను నాలుగున్నర కోట్లకు దిల్ రాజుకు అమ్మేసినట్లు సమాచారం. అలాగే మిగతా ఏరియాల నుంచి కూడా అడ్వాన్సులు అందినట్లు టాక్. అందుకే ఏమి చేయలేక నిర్మాతలు ఉప్పెన లాంటి ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు టాక్.