వెండితెరపై భారీ విజయాన్ని నమోదు చేసిన ‘ఉప్పెన’… బుల్లితెరపై కూడా అదే జోరు చూపిస్తుంది. స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైనప్పుడు ‘ఉప్పెన’ ఏకంగా 18.51 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ మధ్యకాలంలో ‘అల.. వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల తర్వాత అత్యధిక టి.ఆర్.పి రేటింగ్ సాధించిన సినిమాగా ‘ఉప్పెన’ రికార్డు నెలకొల్పింది. మొదటి సారి మాత్రమే కాదు రెండోసారి కూడా మంచి టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.
‘ఉప్పెన’. గతవారం మళ్ళీ స్టార్ మా వారు ‘ఉప్పెన’ ను టెలికాస్ట్ చేయగా ఈసారి 11.37 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను సుమారు రూ.8 కోట్లకు కొనుగోలు చేశారు స్టార్ మా వారు. మొదటిసారి టెలికాస్ట్ చేసినప్పుడే వీళ్ళ పెట్టుబడి మొత్తం రికవరీ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇక రెండోసారి టెలికాస్ట్ అయినప్పుడు వచ్చిందంతా లాభాలు అన్న మాట.రూ.21 కోట్లకు ‘ఉప్పెన’ థియేట్రికల్ హక్కులను విక్రయిస్తే..
ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.52 కోట్ల వరకు షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బయ్యర్లు రెండింతలు పైగా లాభాలను ఆర్జించారు.బుల్లితెర పై కూడా ఈ చిత్రం డబుల్ ప్రాఫిట్స్ ను మిగల్చడం ఖాయంగా కనిపిస్తుంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ల పెయిర్ అలాగే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ చిత్రాన్ని సూపర్ హిట్ గా నిలబెట్టినట్టు స్పష్టమవుతుంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకుడు కాగా విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించాడు.