‘ఊర్వశివో రాక్షశివో’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘ఒక్క క్షణం’, ‘ఎబిసిడి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన అల్లు అరవింద్ గారి రెండో అబ్బాయి అల్లు శిరీష్ నవంబర్ 4న ‘ఊర్వశివో రాక్షశివో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.కళ్యాణ్ దేవ్ తో ‘విజేత’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. అను ఇమాన్యుల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో వెన్నెల కిషోర్, సునీల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘ఊర్వశివో రాక్షసివో’ టీజర్, ట్రైలర్ లకు మంచి మార్కులే పడ్డాయి.దీంతో ఈ మూవీకి డీసెంట్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 2.20 cr
సీడెడ్ 0.80 cr
ఆంధ్ర 2.80 cr
ఏపీ +తెలంగాణ 5.80 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.30 cr
ఓవర్సీస్ 0.40 cr
వరల్డ్ వైడ్(టోటల్) 6.50 cr

‘ఊర్వశివో రాక్షశివో’ చిత్రానికి రూ.6.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.6.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. టాక్ పాజిటివ్ గా వస్తే తప్ప బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోవచ్చు.

మరో పక్క ‘కాంతార’ హవా ఇప్పటికీ నడుస్తుంది. ‘సర్దార్’ కూడా కొంత వరకు రాణిస్తుంది. ఈ నేపథ్యంలో ‘ఊర్వశివో రాక్షశివో’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus