‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘ఒక్క క్షణం’, ‘ఎబిసిడి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన అల్లు అరవింద్ గారి రెండో అబ్బాయి అల్లు శిరీష్ నవంబర్ 4న ‘ఊర్వశివో రాక్షశివో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కళ్యాణ్ దేవ్ తో ‘విజేత’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. అను ఇమాన్యుల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో వెన్నెల కిషోర్, సునీల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘ఊర్వశివో రాక్షసివో’ టీజర్, ట్రైలర్ లకు మంచి మార్కులే పడ్డాయి.మొదటి రోజు ఈ మూవీ పర్వాలేదు అనిపించే విధంగా టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం దారుణంగా నమోదయ్యాయి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.08 cr |
సీడెడ్ | 0.42 cr |
ఉత్తరాంధ్ర | 0.43 cr |
ఈస్ట్ | 0.25 cr |
వెస్ట్ | 0.15 cr |
గుంటూరు | 0.20 cr |
కృష్ణా | 0.25 cr |
నెల్లూరు | 0.11 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.89 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
0.43 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 3.32 cr (షేర్) |
‘ఊర్వశివో రాక్షశివో’ చిత్రానికి రూ.6.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.6.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ కేవలం రూ.3.32 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బయ్యర్లు రూ.3.43 కోట్లు నష్టపోయారు. ‘కాంతార’ ‘యశోద’ వంటి చిత్రాల మధ్య ఈ మూవీ నిలబడలేకపోయింది అని చెప్పాలి.
పైగా అన్ సీజన్ కూడా కావడం ఓ మైనస్. వేరే సీజన్లో కనుక ఈ మూవీ రిలీజ్ అయ్యి ఉంటే ఫలితం మరోలా ఉండేది అని చెప్పడంలో సందేహం లేదు.
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..