పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఆల్ టైం హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ళ తర్వాత ఈ కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రూపొందుతోంది. ‘గబ్బర్ సింగ్’ కి అద్భుతమైన ఆడియో ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కూడా సంగీతం అందించారు.
ఈరోజు ఫస్ట్ సింగిల్ గా ‘దేఖ్ లేంగే సాంగ్’ ని విడుదల చేశారు.ఇక ఈ లిరికల్ సాంగ్ విషయానికి వస్తే.. ఇది 4 నిమిషాల 6 సెకన్ల నిడివి కలిగి ఉంది.

‘రంపంపం.. రంపంపం.. స్టెప్ ఏస్తే భూకంపం’ అంటూ చాలా హుషారుగా మొదలైంది ఈ పాట. పవన్ కళ్యాణ్ స్టెప్స్ ఓపెనింగ్ షాట్ నుండి అదిరిపోయాయి. ఆ హుక్ స్టెప్స్ ను ఈ సాంగ్ అంతా వాడారు.

‘బే ఆఫ్ బెంగాల్ పొంగుతున్నా.. రే ఆఫ్ హోపే తగ్గుతున్నా.. ధగ్ ఆఫ్ వారే జరుగుతున్నా.. టేక్ ఆఫ్ లేటయ్యినా…’ అంటూ వచ్చే లిరిక్స్ అదిరిపోయే. ఆ వెంటనే ‘దేఖ్ లేంగే సాలా.. చూసినామ్లే చాలా’ అంటూ అందుకున్న లైన్ కూడా అందరినీ యాక్టివ్ మోడ్లోకి తీసుకొచ్చేలా ఉంది. దీనికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ కూడా అదిరిపోయింది. భాస్కర్ భట్ల అందించిన లిరిక్స్ కూడా ఇన్స్పిరేషనల్ గా ఉన్నాయి.

విశాల్ దడ్లాని హుషారెత్తించే విధంగా ఈ పాటని పాడాడు. వినగానే ఎక్కేసేలా ఉంది ఈ పాట. దర్శకుడు హరీష్ శంకర్ ఈ ఒక్కపాటతోనే ఫుల్ మీల్స్ పెట్టేశాడు అనే ఫీలింగ్ కలిగిస్తుంది. మీరు కూడా వెంటనే చూస్తూ వినేయండి :
