Ustaad Movie Review in Telugu: ఉస్తాద్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • శ్రీసింహ కోడూరి (Hero)
  • కావ్య కళ్యాణ్ రామ్ (Heroine)
  • గౌతమ్ వాసుదేవ్ మీనన్, రవీంద్ర విజయ్, రవి శివతేజ, అను హాసన్ తదితరులు.. (Cast)
  • ఫణిదీప్ (Director)
  • రజనీ కొర్రపాటి-గడ్డం రాకేష్ - హిమాంక్ దువ్వూరు (Producer)
  • బి.అకీవ (Music)
  • పవన్ కుమార్ పప్పుల (Cinematography)
  • Release Date : ఆగస్ట్ 12, 2023

“మత్తువదలరా” లాంటి కంటెంట్ సినిమాతో తెరంగేట్రం చేసిన కీరవాణి కుమారుడు శ్రీసింహ కోడూరి.. అనంతరం నటించిన సినిమాలతో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా శ్రీసింహ మునుపటి చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో “ఉస్తాద్” మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పింది. మరి శ్రీసింహ “ఉస్తాద్”తోనైనా మంచి హిట్ కొట్టగలిగాడా లేదా అనేది చూద్దాం..!!

కథ: సూర్య (శ్రీసింహ) ఓ సాధారణ యువకుడు. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని, తల్లి (అను హాసన్) మమకారంతో పెరుగుతాడు. ఓ మానసిక సమస్యతో బాధపడుతున్న సూర్యకి తల్లి కొనిచ్చిన బైక్ (ఉస్తాద్) తోడుగా నిలుస్తుంది. సూర్య ప్రతి ఎమోషన్ లోనూ ఉస్తాద్ ఒక భాగమవుతుంది. మేఘన (కావ్య కళ్యాణ్ రామ్)తో తన తొలి ప్రేమ నుంచి పైలట్ అవ్వాలనే తన ఆశయం వరకూ ప్రతి విషయంలో ఉస్తాద్ ఓ భాగం. అలా ఉస్తాద్ తో సూర్య సాగించిన ప్రయాణమే ఈ చిత్రం.

నటీనటుల పనితీరు: రెండు విభిన్నమైన షేడ్స్ లో శ్రీసింహ అభినందనీయమైన నటన ప్రదర్శించాడు. ముఖ్యంగా అతడు కోపాన్ని తెరపై పండించిన విధానం బాగుంది, యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే వేరియేషన్ అది. కావ్య కళ్యాణ్ రామ్ తన స్క్రిప్ట్ సెలక్షన్ తో ఎదుగుతున్న తీరు ప్రశంసనీయం. కమర్షియల్ సినిమాల కోసం తాపత్రయపడకుండా..

క్యారెక్టర్ డ్రివెన్ రోల్స్ తో ఆమె కెరీర్ లో ముందుకు సాగుతున్న విధానమే ఆమె కెరీర్ కు పెద్ద ప్లస్. రవీంద్ర విజయ్, అను హాసన్, రవి శివతేజలు తమకు లభించిన పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా రవి శివతేజ కామెడీ పంచులు కుర్రకారును మెప్పిస్తాయి.

సాంకేతికవర్గం పనితీరు: అకీవ నేపధ్య సంగీతం విషయంలో పర్వాలేదనిపించుకున్నా.. పాటల విషయంలో మాత్రం కనీస స్థాయిలో కూడా అలరించలేకపోయాడు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఆ పాటలు సాహిత్యాన్ని ఏమాత్రం ఎలివేట్ చేయలేకపోయాయి. పవన్ కుమార్ కెమెరా వర్క్ నీట్ గా ఉంది. 2000 సంవత్సరం నాటి పరిస్థితులను తక్కువ బడ్జెట్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తిస్థాయి సపోర్ట్ లేకుండా తెరకెక్కించిన తీరు బాగుంది. భవిష్యత్ లో మంచి అవకాశాలొస్తాయి. నిర్మాతలు మాత్రం ప్రొడక్షన్ డిజైన్ విషయంలో మరీ ఎక్కువ జాగ్రత్తపడ్డారనిపించింది.

దర్శకుడు ఫణిదీప్ రాసుకున్న కథలో ఉన్న నిజాయితీ.. కథనంలో లోపించింది. లైఫ్ లోని కొన్ని ఫేస్ లను బైక్ కోణంలో చూపించిన విధానం బాగుంది కానీ.. క్యారెక్టర్స్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి, ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడానికి అవసరానికి మించిన టైమ్ తీసుకున్నాడు. అందువల్ల.. రెండున్నర గంటలపాటు సాగిన సినిమాలో ల్యాగ్ మరీ ఎక్కువైంది. అయితే.. ట్రైలర్ కట్ చేసిన విధానంలోనే సినిమాను కూడా నడిపి ఉంటే బాగుండేది.

విశ్లేషణ: బైక్స్ ను ఫ్యామిలీలా ట్రీట్ చేసే యూత్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వగలిగే సినిమా “ఉస్తాద్”. కథనం విషయంలో కాస్త జాగ్రత్త పడి ఉంటే మాత్రం శ్రీసింహ కెరీర్ లో మంచి సినిమాగా మిగిలేది.

రేటింగ్: 2/5

Click Here To Read in TELUGU

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus