పెళ్లి రోజున.. చనిపోయిన తన భార్యని తలుచుకుంటూ ఉత్తేజ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్, విలక్షణ నటుడు అయిన ఉత్తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో చిత్రాల్లో తన కామెడీతో అలాగే విలక్షణమైన నటనతో మెప్పించాడు. అయితే 2021 సెప్టెంబర్ 13న ఉత్తేజ్ భార్య పద్మ మరణించిన సంగతి తెలిసిందే. బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు.అనారోగ్య సమస్యల కారణంగా ఆమె మరణించింది. ఉత్తేజ్ దంపతులకు ఇద్దరు పిల్లలు. వాళ్ళ పేర్లు చేతన, పాట. ఈ ఇద్దరి కోసమే ఉత్తేజ్ తన భార్య లేదు బాధను దిగమింగుకొని బ్రతుకుతున్నాడు.

అయితే ఏప్రిల్ 8న ఉత్తేజ్ – పద్మ ల పెళ్లి రోజు. దీంతో ఉత్తేజ్ తన ఫేస్బుక్ లో భార్యను తలచుకుంటూ ఎమోషనల్ లెటర్ పోస్ట్ చేశాడు. అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లెటర్ ద్వారా ఉత్తేజ్ స్పందిస్తూ.. “పద్దూ….పెళ్లిరోజు శుభాకాంక్షలు…మనకు…..నిన్ను చాలా..నా జీవితమంత మిస్ అవుతున్న…..ఎక్కడో ఉన్నావ్..ఎలా ఉన్నావ్….నువ్వూ….నేను.”మనం” అయిన రోజు..పెళ్లిరోజు..కుటుంబ వ్యవస్థకు నాందీ వాచకం పలికిన రోజు. పద్దూ.. !! పెళ్లి కి ముందు, మా నాన్నకి ఉత్తరం రాసావు, మీ అబ్బాయి నేను ఇష్టపడుతున్నాం.

.మీరు సమ్మతిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం.అని,.. మరి నేనో…నీకు లవ్ లెటర్ రాసి, ఏమీ తెలియనట్టుగా మానాన్న అడ్రస్ రాసిన ఎన్వలప్ కవర్ లో పెట్టి పోస్ట్ చేసా…చాలా అందంగా మన విషయాన్ని చెప్పేసామ్…మా నాన్న నవ్వుతూనే అమ్మాయి వాళ్ళకి కూడా ok అయితే మాకు ok అనేశారు.. మా నాన్న అమ్మ ఎంతో గొప్పవాళ్లు అనేదానివి,వాళ్ళు పోయేంతవరకు కూడా మీ కులమేంటో తెలియదు, అడగలేదు కూడా…కదా!ఇక,నేను మీ గుడివాడ రావడం మీ అన్నయ్యలతో మాట్లాడ్డం,నువ్వు భయం భయంగా నిల్చోవడం…సినిమా వాళ్లని ఎలా నమ్మేదంటూ…ప్రశ్నలు..ప్రశ్నలు…ఇంటర్వ్యూల అనంతరం… మీ అమ్మ గ్రేట్ నన్ను నమ్మింది.

మొత్తానికి ఇరు కుటుంబాల ఆమోదంతో, ఇష్టమైన సినిమా థియేటర్ నే గుడిగా చేసుకుని పెళ్లి చేసుకున్నాం.. పెళ్లికి ముందు, ఇద్దరం తిరుమల కాలి బాటన వెళ్లాం….మొండిదానివి నడిచేసావ్ నవ్వుతూనే,మన పిల్లలతో కలిసి, మన పెళ్లి వీడియో,పెళ్లి ఫొటోస్చూ స్తూ…ఒకరినొకరమ్ వెక్కిరించుకుంటూ, నవ్వుకుంటూ…జీవితాన్ని గడుపుతూన్న టైం లో..ఏంటిది పద్దూ…!!మ్మ్….” నాలో సగమై వచ్చి,నాతో సగమే నడిచి, ఎటు వెళ్ళావ్….”తిరిగి రాని రోజులకోసం తిరిగి, తిరిగి చూస్తున్నా పద్దూ…..లవ్ యూ పద్దమ్మ…పెళ్లి రోజు శుభాకాంక్షలు మనకు ..” అంటూ రాసుకొచ్చాడు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus