Vadivelu,Prabhu Deva: వడివేలు కోసం డ్యాన్స్‌ కంపోజ్‌ చేసిన ప్రభుదేవా!

తమిళనాట కామెడీ పేరున్న నటుడు వడివేలు.. దేశం మొత్తం డ్యాన్స్‌కు పేరున్న కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిశారు. అదేంటి ఈ ఇద్దరూ కలిశారా? దేనికోసమబ్బా. అయినా వడివేలు సినిమాలు చేయడం లేదు, ప్రభుదేవా డ్యాన్స్‌ కొరియోగ్రఫీ తగ్గించేశారు కదా అంటారా. అది నిజమే కానీ, ఇప్పుడు ఈ ఇద్దరు కలిసింది కూడ అందుకే. వడివేలు కొత్త సినిమాలో ఓ పాటకు ప్రభుదేవా స్టెప్పులు కంపోజ్‌ చేశారట. తమిళ సినీ పరిశ్రమను కొన్నేళ్లపాటు ఏలిన కమెడియన్‌ వడివేలు.

Click Here To Watch NOW

అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం, కీలకమైన కామెంట్లు చేయడం… ఓ సినిమా విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం తదితర కారణాలతో సినిమాకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ నటుడిగా బిజీ అయ్యే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ‘నాయిశేఖర్ రిటర్న్స్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసమే వడివేలు – ప్రభుదేవా కలిశారట. ప్రముఖ దర్శకుడు సూర‌జ్ ఈ సినిమా రూపొందిస్తున్నారు. సుంద‌ర్.సి హీరోగా సూరజ్‌ గతంలో తెరకెక్కించిన ‘తళై నగరం’ అనే సినిమాలో నాయిశేఖర్‌ పాత్ర చాలా ఫేమస్‌.

ఆ సినిమాలో వడివేలు నాయిశేఖర్‌గా అదరగొట్టేశాడు. ఇప్పుడు ఆ పాత్రనే కీలకంగా తీసుకొని ‘నాయి శేఖర్‌ రిటర్న్స్‌’ అనే సినిమా చేస్తున్నారు. అందులో ఓ కీలకమైన పాటకు స్టెప్పులు కంపోజ్‌ చేయడానికి ప్రభుదేవా వచ్చారట. సౌత్ ఇండియాలో టాప్ హీరోలంద‌రికీ డ్యాన్స్ కంపోజ్‌ చేసిన… ప్రభుదేవా ఆ తర్వాత తగ్గించేశారు. అప్పుడప్పుడు ఒకటి, రెండు పాటలు చేశాడు. ఇప్పుడు వడివేలు కోసం మళ్లీ వన్‌ టు త్రీ… అంటూ స్టెప్పులు రెడీ చేస్తున్నారు.

‘నాయి శేఖర్‌ రిటర్న్స్‌’ సెట్‌లో వడివేలు, ప్రభుదేవా దిగిన ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుదేవాకి, వడివేలుకి మంచి అనుబంధం ఉంది. గతంలో చాలా సినిమాల్లో ఇద్దరూ కలసి పని చేశారు. ఆ అభిమానంతోనే వడివేలు కోసం ప్రభుదేవా డ్యాన్స్‌ కంపోజ్‌ కోసం ముందుకొచ్చారని టాక్‌. మరి ఎలాంటి స్టెప్పులు ఉంటాయి, వాటిని వడివేలు ఎలా వేశారు అనేది ఇంట్రెస్టింగ్‌.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus