మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరోలందరూ వారి సొంత మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతుండగా, వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) మాత్రం ఇంకా ఒక క్లియర్ రూట్ లో ప్రయాణం కొనసాగించలేకపోతున్నాడు. తొలి చిత్రం ఉప్పెనతో (Uppena) ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకున్న ఆయన, ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఆ రేంజ్ విజయాన్ని అందుకోలేకపోయాడు. అయితే వైష్ణవ్ ఎంచుకుంటున్న కథలు, కంటెంట్ పట్ల అతని ప్రయత్నం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇటీవలే విడుదలైన ఆదికేశవ (Aadikeshava) చిత్రం పరాజయం చెందడంతో, వైష్ణవ్ తన సినిమాల ఎంపిక పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తన కొత్త ప్రాజెక్టులకు ఒకేసారి ఇద్దరు ప్రతిభావంతులైన దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్, యువ దర్శకుడు విరించి వర్మతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడని సమాచారం.
ఉయ్యాల జంపాల (Uyyala Jampala) , మజ్ను (Majnu) వంటి హిట్ సినిమాలతో గుర్తింపు పొందిన విరించి వర్మ (Virinchi Varma), విలేజ్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ కథను సిద్ధం చేసినట్లు టాక్. అంతేకాక, మరొక ప్రతిభావంతుడైన కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు కూడా వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కృష్ణ చైతన్య (Krishna Chaitanya) ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ( Gangs of Godavari) అనే ప్రయోగాత్మక సినిమాతో ప్రశంసలు అందుకున్నాడు.
ఇప్పుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) కోసం అతను మరొక యూనిక్ కథను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు వైష్ణవ్‌కు కొత్త తరహా ప్రయోగాల కోసం మంచి వేదికగా మారే అవకాశముంది. ఇంతవరకు చేసిన ప్రయోగాల్లో పెద్దగా విజయాలు నమోదు కాకపోయినా, వైష్ణవ్ తేజ్ తన కొత్త కథల ఎంపికతో ట్రాక్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో మళ్ళీ ఉప్పెన రేంజ్ లో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. మరి వైష్ణవ్ తన మార్కెట్‌ను పునరుద్ధరించగలడో లేదో చూడాలి.