Vaishnavi Chaitanya: అల్లు అర్జున్‌, ప్రభాస్‌ సినిమాల్లో ఛాన్స్‌.. వైష్ణవీ చైతన్య రియాక్షన్‌ ఏంటంటే?

టాలీవుడ్‌లో లేటెస్ట్‌ లేడీ సెన్సేషన్‌ అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు ఏ ముంబయి హీరోయిన్‌దో లేక మలయాళీ భామదో అయి ఉంటుంది. ఇదేదో ఊహించి చెప్పే మాట కాదు. గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలో సెన్సేషన్లు ఇలా వచ్చినవే, అలరించినవే. అయితే చాలా కాలం తర్వాత ‘బేబీ’ (Baby) సినిమాతో తెలుగు అమ్మాయిలు కూడా సెన్సేషన్‌గా మారుతారు టాలీవుడ్‌లో అని నిరూపించింది వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) . ఇప్పుడు ఆమె గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది అంటే..

ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘లవ్‌ మీ: ఇఫ్‌ యూ డేర్‌’ (Love Me) అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది కాబట్టి. ఆశిష్‌ (Ashish Reddy) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. నూతన దర్శకుడు అరుణ్‌ భీమవరపు రూపొందించిన ఈ సినిమాను దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మే 25న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌ ఇటీవల నిర్వహించారు. నటిగా ‘బేబీ’ సినిమా తనకు తొలి మెట్టు అని చెప్పిన వైష్ణవి చైతన్య ‘లవ్‌ మీ’ రెండో మెట్టు అని చెప్పింది.

సినిమా సినిమాకు కెరీర్‌ను విభిన్నంగా ప్లాన్‌ చేసుకుంటూ ముందుకెళ్తున్నా అని చెప్పింది. ఇక అల్లు అర్జున్‌ (Allu Arjun) సరసన నటించే అవకాశం ఉందా అని అడిగితే.. ప్రస్తుతానికి లేదని, ఒకవేళ ఛాన్స్‌ వస్తే తప్పకుండా నటిస్తా అని చెప్పింది. ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramulo) సినిమాలో బన్నీకి వైష్ణవి సోదరిగా నటించిన విషయం తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్‌ సినిమా ఆలోచ అయితే ఉందని, అయితే భవిష్యత్తులో ఆ సినిమా చేస్తానేమో అని చెప్పింది.

‘స్పిరిట్‌’ (Spirit) సినిమాలో ప్రభాస్‌కు (Prabhas) సోదరిగా నటిస్తున్నారట కదా.. అని అడిగితే అవి రూమర్సే అని, అయితే అలాంటి అవకాశం వస్తే వదులుకోను అని చెప్పింది. ఫైనల్‌గా మీ ఫస్ట్‌ సెలబ్రిటీ క్రష్‌ ఎవరు అని అడిగితే ఇస్మార్ట్‌ హీరో రామ్‌ పోతినేని  (Ram) అని చెప్పింది. మరి రామ్‌తో నటించే ఛాన్స్‌ వస్తే ఏం చేస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus