వైష్ణవ్ తేజ్ కి భారీ రెమ్యునరేషన్ ఇవ్వనున్న నాగ్!

గత కొన్ని రోజులుగా అక్కినేని నాగార్జున తన బ్యానర్ లో వైష్ణవ్ తేజ్ ని హీరోగా పెట్టి సినిమా తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయమని చెబుతున్నారు. ‘మనం ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ లో నాగార్జున నిర్మించబోయే సినిమాలో వైష్ణవ్ తేజ్ నటించనున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. పృథ్వీ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. నాగార్జున తన సొంత సినిమాలను నిర్మించుకోవడంతో పాటు అప్పుడప్పుడు బయటవారితో కూడా సినిమాలు తీస్తుంటాడు.

గతంలో చాలా సినిమాలను నిర్మించారు. ఆయన చివరిగా నిర్మించిన చిత్రం ‘రంగుల రాట్నం’. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో నాగ్ నిర్మాతగా కొంత గ్యాప్ తీసుకున్నాడు. అయితే రీసెంట్ గా తన దగ్గరకు ఓ మంచి కథ రావడం.. ఆ కథకి వైష్ణవ్ తేజ్ సరిపోతాడని అనిపించడంతో వెంటనే సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. మెగా క్యాంప్ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాకి రెమ్యునరేషన్ గా వైష్ణవ్ తేజ్ కు రూ.3 కోట్లు ఇవ్వాలని నాగ్ నిర్ణయించుకున్నాడట.

ఎందుకంటే ప్రస్తుతం వైష్ణవ్ కి అదే రేంజ్ లో రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు నిర్మాతలు. భోగవల్లి ప్రసాద్ నిర్మించనున్న సినిమాకి గాను వైష్ణవ్ తేజ్ మూడు కోట్లకు దగ్గరగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. అందుకే నాగ్ కూడా అదే రేంజ్ లో తన పారితోషికం ఫిక్స్ చేశాడు. కొన్ని రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus