ఇండస్ట్రీలో “క్యాస్టింగ్ కౌచ్” గురించి జరుగుతున్న అమానుషాలని అరికట్టడం కోసం పరిశ్రమ పెద్దలందరూ కలిసి “క్యాష్” (కమిటీ ఫర్ సెక్సువల్ హెరాస్ మెంట్)ను యుద్ధ ప్రాతిపదికన స్థాపించడం తెలిసిందే. ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రమే కాకుండా పబ్లిక్ సెక్టార్ నుంచి కూడా విద్యాధికులు ఈ బృందంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ కమిటీ మొదటి పంజా ఎగ్జిక్యీటివ్ ప్రొడ్యూసర్ గా పలు భారీ చిత్రాలకు పనిచేసిన వాకాడ అప్పారావు మీద తొలి పంజా విసిరింది.
ఇటీవల ఓ న్యూస్ చానల్ పుణ్యమా అని వాకాడ అప్పారావు పాల్పడిన నీచమైన కార్యక్రమాలు, ఆఖరికి జూనియర్ ఆర్టిస్ట్ అవకాశాల కోసం కూడా అతడు అమ్మాయిల్ని ఎలా వాడుకొన్నాడు వంటి విషయాలు బయటకి రావడం, లైవ్ డిబేట్ లో తన నిజాయితీని ప్రూవ్ చేసుకోలేకపోవడమే కాక పదుల సంఖ్యలో ఆడవాళ్ళు ప్రూఫ్స్ తో వాకాడ అప్పారావు మీద విరుచుకుపడడంతో.. కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ వాకాడ అప్పారావును తమ సంస్థ నుంచి తొలగించింది. ఇక క్యాష్ కమిటీ అప్పారావు కారణంగా జీవితాలు కోల్పోయిన ఆడవారికి న్యాయం చేసేందుకు నడుం బింగించింది. ఈ పరిణామం జరగడం మంచిదే.. ఎందుకంటే ఇకపై అవకాశాల కోసం అమ్మాయిని వాడుకోవాలనే ఆలోచన కూడా మరొకరికి రాకుండా ఇలాంటి క్యాష్ కమిటీలు భవిష్యత్ నిర్ణయాలు, ప్రణాళికలు ఉండాలని కోరుకొందాం.