3 ఏళ్ళ తరువాత ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ నుండీ రాబోతున్న చిత్రం ‘వకీల్ సాబ్’.బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసాడు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, బోణి కపూర్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగెళ్ళ వంటి భామలు కూడా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది..
బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవడానికి ఎంత రాబట్టాలి అనే విషయాలను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 26.00 cr |
సీడెడ్ | 13.00 cr |
ఉత్తరాంధ్ర | 10.50 cr |
ఈస్ట్ | 7.00 cr |
వెస్ట్ | 6.00 cr |
గుంటూరు | 7.50 cr |
కృష్ణా | 6.00 cr |
నెల్లూరు | 3.35 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 79.35 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 5.50 cr |
ఓవర్సీస్ | 5.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 89.85 cr |
‘వకీల్ సాబ్’ చిత్రానికి 89.85కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 90.5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాలి. విజయ్ మాస్టర్ తరువాత సౌత్ లో విడుదల కాబోతున్న పెద్ద సినిమా ఇదే. నిజానికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు ఇది పెద్ద టార్గెట్ ఏమీ కాదు. సోలో రిలీజ్ దక్కనుంది.. పైగా ‘ఉగాది’ పండుగ సెలవు అలాగే సమ్మర్ హాలిడేస్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి..మొదటిరోజు సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్లను నమోదయ్యే అవకాశం ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ అలాగే ఐ.పి.యల్ ఎఫెక్ట్ కూడా కొంతవరకూ ఈ సినిమా కలెక్షన్ల పై పడే అవకాశం లేకపోలేదు. చూడాలి.. ఫైనల్ గా ‘వకీల్ సాబ్’ ఎలా కలెక్ట్ చేస్తాడో..!
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!