మహేష్ 25 వ మూవీ కెమెరామెన్ పై వంశీ కామెంట్.!

సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో చేసిన భరత్ అనే నేను సినిమా సూపర్ హిట్ అయింది. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించనున్నారు. జూన్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి  పోస్ట్ ప్రొడక్షన్ పక్కాగా జరుగుతోంది. అమెరికా నేపథ్యములో సాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా డీజే బ్యూటీ పూజా హెగ్డే ఖరారు అయింది.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం  డైరక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు తో కలిసి న్యూ యార్క్ కి వెళ్లి అక్కడ అందమైన లొకేషన్స్ ని సెలక్ట్ చేశారు.

ఇప్పుడు కెమెరామెన్ కేయూ మోహనన్ తో కలిసి ఇంకా అందంగా ఎలా షూట్ చేయాలో వంశీ ప్లాన్ చేస్తున్నారు. ఇతను బాలీవుడ్ లో డాన్ వంటి అనేక సినిమాలు కెమెరామెన్ గా చేసారు. తొలిసారి తెలుగు చిత్రం చేస్తున్నారు. అతని గురించి  డైరక్టర్ వంశీ ఈరోజు ట్వీట్ చేశారు. “సార్.. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా అనేక విషయాలు నేర్చుకున్నాను. మీ లెన్స్ తో న్యూయార్క్ అందాలను మరింత బ్యూటిఫుల్ గా చూపిస్తారని నమ్ముతున్నాను” అని ఇద్దరూ కలిసి ఉన్న సెల్ఫీ ని పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు ఆనందపడుతున్నారు. తమ హీరో ప్రతిష్టాత్మకమైన సినిమా అన్ని రికార్డులను తిరగరాయాలని కోరుకుంటున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో  మహేష్ ఫ్రెండ్ రోల్ ని అల్లరి నరేష్ పోషిస్తుండగా.. అతనికి జోడీగా ‘అర్జున్‌రెడ్డి’ భామ షాలిని పాండే  నటించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus