పద్మ అవార్డ్స్ 2023: కీరవాణికి పద్మశ్రీ, వాణీ జయరామ్ కు పద్మభూషణ్!

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ నామినేషన్ లభించిన సంతోషంలో ఉన్న కీరవాణి కుటుంబం, అభిమానులు ఇప్పుడు పద్మ పురస్కారంతో మరింత ఆనందపడుతున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, తబలా విద్వాంసుడు, నటుడు జాకిర్ హుస్సేన్ ను పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. మహారాష్ట్ర నుంచి ఆయన ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ ను పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించారు. తమిళనాడు రాష్ట్రం నుంచి ఆమెని ఈ అవార్డుకి ఎంపిక చేశారు. మహారాష్ట్ర నుంచి మరో సింగర్ సుమన్ కళ్యాన్పూర్ కూడా ఈ అవార్డుని అందుకోనున్నారు. ఎం.ఎం.కీరవాణికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది. మొన్న గోల్డెన్ గ్లోబ్.. ఇప్పుడు పద్మ అవార్డు రావడంతో కీరవాణి పేరు బాగా వినిపిస్తోంది. సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూడా పద్మశ్రీ అందుకోనున్నారు.

ఈ ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో ఆరుగురికి పద్మ విభూషణ్, తొమ్మిది మందికి పద్మ భూషణ్, మరో 91 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు పది మందికి పద్మ అవార్డులు దక్కాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరికి పద్మ భూషణ్ రాగా, ముగ్గురు ప్రముఖులకు పద్మ శ్రీ దక్కింది. ఆధ్మాత్మికం విభాగంలో చిన్న జీయర్ స్వామి, కమలేష్ డి పటేల్ పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.

ఓఆర్ఎస్ సృష్టికర్త డాక్టర్ దిలీప్ మహాలనబీస్ కు పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించారు. కాకినాడకు చెందిన సంఘసంస్కర్త, సామాజిక వేత్త సంకురాత్రి చంద్రశేఖర్ కు పద్మశ్రీ వరించింది. తెలంగాణకు చెందిన 80 ఏళ్ల ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డిని పద్మశ్రీతో సత్కరించారు. కువి, మండా, కుయి అనే గిరిజన తెగల భాషను కాపాడుకునేందుకు ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి చేసిన విశేష కృషికి గానూ పద్మశ్రీ వరించింది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus