మీకు మరో ప్రశ్న దొరకదా.. జయమ్మ తీవ్ర ఆగ్రహం..!
- March 9, 2021 / 06:32 PM ISTByFilmy Focus
రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు వరలక్ష్మి శరత్ కుమార్. ఆ సినిమా తరువాత గత నెలలో విడుదలైన నాంది సినిమా కూడా వరలక్ష్మికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ ఏడాది వరలక్ష్మి నటించి విడుదలైన రెండు సినిమాలు హిట్ కావడంతో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తే సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ తెరపైకి వస్తోంది.
తమిళంతో పోలిస్తే తెలుగులోనే వరుస అవకాశాలతో బిజీ అవుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఎవరైనా పెళ్లి గురించి అడిగితే మాత్రం తెగ సీరియస్ అవుతున్నారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ అభిమానులను సంపాదించుకుంటున్న వరలక్ష్మి అనాథ పిల్లల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. వేడుకల అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనాథల మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అయితే ఆ సమయంలో కొంతమంది జర్నలిస్టులు వరలక్ష్మిని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించారు.

వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి గురించి ప్రశ్న ఎదురు కావడంతో జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు. పదేపదే పెళ్లి ప్రస్తావన ఎందుకు తెస్తారని వరలక్ష్మి మండిపడ్డారు. మహిళగా పుట్టినవాళ్లు కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని ఏదైనా షరతు ఉందా..? అని ఆమె ప్రశ్నించారు. మీకు మరో ప్రశ్న దొరకదా..? అని జర్నలిస్టులను ఆమె ప్రశ్నించారు. గతంలో ఒక కోలీవుడ్ హీరోతో ప్రేమాయణం నడిపి వరలక్ష్మి శరత్ కుమార్ వార్తల్లో నిలిచారు. అయితే ఆ తరువాత ఆ కోలీవుడ్ హీరోకు వరలక్ష్మి శరత్ కుమార్ దూరమయ్యారు. వరలక్ష్మి పెళ్లి గురించి చేసిన కామెంట్లను బట్టి ఆమె భవిష్యత్తులో కూడా పెళ్లి చేసుకోరా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Most Recommended Video
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!












