నాకు అసలు మగాడి అవసరంలేదంటున్న శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి

ప్రేమలో బ్రేక్ అప్ కొన్ని అయితే, పెళ్లి వరకు కొన్ని వెళతాయి. కానీ ఈ హీరోయిన్ మాత్రం అసలు నాకు పెళ్లి అనేది వద్దు అని చెబుతుంది. అవసరమైతే ప్రేమిస్తాను కానీ పెళ్లి మాత్రం చేసుకోను అంటుంది. పెళ్లి చేసుకొని మగాడి దగ్గర తల దించుకొని బ్రతకటం ఏ మాత్రం ఇష్టం లేదని, ఒకవేళ ప్రేమించిన ప్రేమ వరకే ఉంటానని ప్రేమని పెళ్లి వరకు తీసుకుపోయే ఆలోచన లేదంటూ చెబుతుంది. హ్యాపీ గా సింగిల్ గానే ఉండటమే తనకు ఇష్టం అంటూ తన మనసులో మాట చెబుతుంది.

ఇక ఈ హీరోయిన్ ఎవరో కాదు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి. ఈమె ప్రస్తుతం కోలీవుడ్ లో నటిగా కొన్ని సినిమాలను చేసింది. అయితే మగవారు సింగిల్ గా ఉన్నప్పుడు మేము సింగిల్ గా ఉండటం లో తప్పేం ఉందంటూ ఈ ముద్దు గుమ్మ ప్రశ్నిస్తుంది. అసలు అమ్మాయిలకి పెళ్లి అనేది ఒక లక్ష్యం కాదని, ఒక మగాడిపైన ఆధారపడి బ్రతకాల్సిన అవసరం ఆడవారికి లేదనేది ఆమె వాదన. ఇప్పటికి కొన్ని సార్లు ప్రేమలో పడి అంతగా సక్సెస్ అవ్వలేదని, నాకు తగ్గ వాడు నన్ను వెతుకుంటూ వస్తే ఆలోచిస్తాను లేదంటే ఎప్పటికి సోలో గానే ఉంటానని తన మనసులో మాట చెప్పేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus