Varalaxmi Sarath Kumar: ‘క్యారెక్టర్ ఆర్టిస్ట్’ అన్నందుకు.. రిపోర్టర్ కి వరలక్ష్మీ చురకలు.!

  • April 24, 2024 / 02:55 PM IST

వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) .. పరిచయం అవసరం లేని పేరు. సీనియర్ నటుడు శరత్ కుమార్ (R. Sarathkumar) కూతురిగా సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటికీ.. ఆమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. కెరీర్ ప్రారంభంలో శరత్ కుమార్ రిఫరెన్స్ తో ఆమెకు హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి. కానీ ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలు ఆడకపోవడం వల్ల అలా సక్సెస్ కాలేకపోయింది. అయితే సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ ఈమె స్టార్ ఇమేజ్ ను దక్కించుకుంది. ‘పందెం కోడి 2 ‘ ‘సర్కార్’ (Sarkar) వంటి సినిమాల్లో వరలక్ష్మీ చేసిన పాత్రలకి మంచి పేరొచ్చింది.

అయితే తెలుగులో ఈమె చేసిన ‘క్రాక్’ (Krack) ‘నాంది’ ‘వీరసింహారెడ్డి’  (Veera Simha Reddy) ‘హనుమాన్’ (Hanu Man) వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో.. ఇక్కడ ఆమె స్టార్ అయిపోయింది. త్వరలో ఆమె లీడ్ రోల్ చేసిన ‘శబరి’ అనే సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న టైంలో వరలక్ష్మీకి ఓ వింత అనుభవం ఎదురైంది. ఆమెను ఓ రిపోర్టర్ ‘క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి సక్సెస్ అయిన మీరు ఇప్పుడు లీడ్ రోల్ చేస్తున్నారు.. ఎలా అనిపిస్తుంది?’ అన్నట్టు ప్రశ్నించాడు.

దీంతో వరలక్ష్మీకి కోపం వచ్చింది. ‘క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఏంటి?’ అంటూ ఆ రిపోర్టర్ ని తిరిగి ప్రశ్నించింది వరలక్ష్మీ. ఈ క్రమంలో ‘ హీరో, హీరోయిన్స్ కాకుండా సినిమాల్లో ఉండే పాత్రల్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్..లు అనే అంటారు కదా?’ అంటూ అతను కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇందుకు వరలక్ష్మీ ” ‘వీరసింహారెడ్డి’  లో హీరోయిన్ పాత్రకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందా? నా పాత్రకి ఎక్కువ ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుందా?” అంటూ మళ్ళీ ప్రశ్నించింది.

ఇందుకు అతను ‘మీ పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది’ అంటూ జవాబిచ్చాడు. అందుకు వరలక్ష్మీ ‘అదే కదా..! కథని నడిపించేది నా పాత్ర అయినప్పుడు నాదే లీడ్ రోల్ అని నేను భావిస్తాను. అందులో బాలకృష్ణ (Nandamuri Balakrishna) గారి పాత్ర తర్వాత నాదే లీడ్ రోల్, డాన్సులు అవీ చేయలేదు అని క్యారెక్టర్ ఆర్టిస్ట్..ని చేసేయకండి’ అంటూ ఘాటుగా బదులిచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus