Balakrishna: బాలయ్య అనిల్ రావిపూడి మూవీ పై క్రేజీ బజ్ విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్?

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే బాలకృష్ణ అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో బాలకృష్ణ తదుపరి సినిమాలపై భారీ అంచనాలు పెరికాయి. ఇక బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపుడితో సినిమా చేయనున్నారు.

ఇకపోతే ఈ సినిమా గురించి తాజాగా ఒక అప్డేట్ విడుదలైంది. అనిల్ రావిపూడి బాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బాలకృష్ణతో లేడీ విలన్ పోటీ పడిబోతున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ద్వారా తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో జయమ్మగా ఈమె అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ఇప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్ సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాలో కీలకపాత్రలో నటించారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ సినిమాలో కూడా ఈమె బాలయ్యతో పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 107 సినిమాలో కూడా వరలక్ష్మి నటిస్తున్నట్లు సమాచారం.

ఇక అనిల్ రావిపూడి ఇప్పటికే బాలకృష్ణ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులన్నింటిని కూడా పూర్తి చేశారని అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.వచ్చే నెల నుంచి అనిల్ రావిపూడి బాలకృష్ణ సినిమా సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus