Varalaxmi Sarathkumar: ఒక్క ఆ హోటల్ లో మాత్రమే.. నటి ఎమోషనల్ పోస్ట్!

ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు పెట్స్ ను పెంచుకుంటున్నారు. సొంత పిల్లలతో సమానంగా తమ పెట్స్ ను ప్రేమిస్తుంటారు. ఛార్మి, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, రష్మీ గౌతమ్ వంటి వారు సోషల్ మీడియాలో పెట్స్ గురించి తరచూ పోస్ట్ లు పెడుతూనే ఉంటారు. తమ పెట్స్ కు సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంటారు.ప్రయాణాల్లో పెట్స్ ను మనతో పాటు పక్కనే ఉండేలా చూసుకోవడం కుదరదు.

కానీ ఇప్పుడు ఈ నిబంధనల్లో కొన్ని మార్పులు వచ్చాయి. ఐదు కేజీల బరువు లోపు ఉండే చిన్న పెట్ అయితే తమతో పాటే తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తన పెట్ మొదటిసారి తనతో ఇలా ప్రయాణం చేసిందని విమానయాణం గురించి వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పుకొచ్చింది. షూటింగ్ కోసం నిన్న చెన్నై నుండి హైదరాబాద్ వచ్చిన వరలక్ష్మీ తనతో పాటు తన పెంపుడు కుక్కను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ అధికారులకు ధన్యవాదాలు చెబుతూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది.

తన పెట్ తో కలిసి ప్రయాణం చేసే సౌకర్యం కలిగించినట్లు ఎయిర్ ఇండియా సంస్థకు థాంక్స్ చెప్పింది. అంతేకాకుండా తనతో పాటు హోటల్ లో తన పెట్ ను కూడా ఉంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన ఓక్ వుడ్ రెసిడెన్సీకి థాంక్స్ చెప్పింది. మిగతా స్టార్స్ హోటల్స్ ఏవీ అంగీకరించలేదని.. ఒక్క ఓక్ వుడ్ రెసిడెన్సీ మాత్రమే ఒప్పుకుందని చెప్పుకొచ్చింది.


విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus