గని మళ్ళీ తగ్గాల్సిందే.. మరో కొత్త డేట్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మల్లి రిలీజ్ డేట్స్ పై కన్ఫ్యూజన్ మొదలైంది. పోటీ తీవ్రత ఎక్కువ కావడంతో కొంతమంది హీరోలు రిస్క్ చేయడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా కరోనా ధాటికి సినిమాలు విడుదలయ్యే వరకు నమ్మకం కలగడం లేదు. ఇక వరుణ్ తేజ్ గని సినిమా కూడా మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అఖండ సినిమా ద్వారా కొంత కోలాహలం నెలకొంది.

ఇక మిగతా సినిమాలు కూడా కంటెంట్ తో మెప్పించగలిగితే ఎలాంటి సమయంలో అయినా కలెక్షన్స్ అందుకుంటాయని చెప్పవచ్చు. ఇక గని సినిమాను డిసెంబర్ 24న విడుదక చేయాలని అనుకుంటూ ఉండగా అదే సమయంలో నాని శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా పోటీకి దిగుతోంది. గని సినిమాను అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మించారు. ఇక ఆయన పోటీలో గని సినిమాని విడుదల చేయకూడదని ఆలోచిస్తున్నాడు. ఇక శ్యామ్ సింగరాయ్ నిర్మాతలు కూడా పోటీ ఉండకూడదు అని ఇదివరకే చర్చలు జరిపారు.

ఇక గని సినిమా వచ్చే ఏడాది మార్చి లో రిలీజ్ కావచ్చని సమాచారం. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక పవర్ఫుల్ గా బాక్సర్ గా కనిపించబోతున్నాడు. మరి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Share.