ఇమ్మాన్యుయేల్ తో పెళ్లి పై స్పందించిన ‘జబర్దస్త్’ వర్ష..!

‘జబర్దస్త్’ కామెడీ షో గురించి.. అందులో స్కిట్స్ చేసేవారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ‘జబర్దస్త్’ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన వర్ష- ఇమ్మాన్యుయేల్ జంట గురించి కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సుడిగాలి సుధీర్-రష్మీ జంట తర్వాత… ప్రేమ, పెళ్లి వార్తలతో బాగా పాపులర్ అయిన జంట ఇదే.! ఇమ్ము-వర్ష మధ్య కెమిస్ట్రీ బేస్ చేసుకుని కొన్ని ఎపిసోడ్స్ కొనసాగుతూ ఉంటాయి.

తాజాగా అలాంటి ఎపిసోడ్ ఒకటి రన్ చేశారు. రియల్ లైఫ్ లో కూడా ఈ జంట లవర్స్ అనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అది నిజమో కాదో తెలీదు కానీ ఎపిసోడ్స్ సక్సెస్ అవుతున్నాయి కాబట్టి… అవి నిజమని స్కిట్స్ చేయిస్తుంది యాజమాన్యం. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అనే ప్రచారం ఊపందుకుంది. అయితే అది రియల్ లైఫ్ లో కాదు.. జబర్దస్త్ స్టేజీ పై మాత్రమే.

ఇలాంటి థీమ్ తో వీళ్ళు గతంలో కూడా స్కిట్స్ చేశారు. టిఆర్పీ కోసం నిజమే అన్నట్టు ప్రోమోలు కూడా విడుదల చేస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచుతుంటారు. ఇదిలా ఉండగా.. ఇమ్మాన్యుయేల్ తో పెళ్లికి వర్ష రెడీ అట. కాకపోతే కొన్ని కండిషన్స్ అప్లై అంటుంది. ‘మన పెళ్లి జరగాలంటే నీకు చాలా పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉండాలి అంటూ వర్ష అంటుంటే …

అందుకు ఇమ్ము.. నాకు చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్ బిల్డప్ కొట్టడం నవ్వులు పూయించింది. అయితే వాళ్ళని పెళ్లికి తీసుకురమ్మని వర్ష కోరగా .. డూపులను తీసుకొచ్చాడు ఇమ్ము. వీళ్ళు డ్యాన్సులతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇలా ఈ ప్రోమో హైలెట్ అయ్యింది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus