Prabhas: ఆ సెంటిమెంట్ ప్రకారం రాధేశ్యామ్ హిట్టేనా?

జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి తొలి ప్రయత్నంలో అబవ్ యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నారు. ఆ తర్వాత ప్రభాస్ రాఘవేంద్ర సినిమాలో నటించగా ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే ఈ రెండు సినిమాలతో ప్రభాస్ కు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ హీరోగా నటించి 2004 సంవత్సరం జనవరి 14వ తేదీన రిలీజైన వర్షం హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు ప్రభాస్ కు స్టార్ హీరో స్టేటస్ ను తెచ్చిపెట్టింది.

వర్షం సినిమాలో ప్రభాస్ కు జోడీగా త్రిష నటించారు. అయితే 18 సంవత్సరాల తర్వాత అదే తేదీకి ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ విడుదలవుతూ ఉండటం గమనార్హం. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే వర్షం, రాధేశ్యామ్ సినిమాలకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ కు రెండో సినిమా కాగా రాధాకృష్ణ కుమార్ కు రాధేశ్యామ్ రెండో మూవీ కావడం గమనార్హం.

శోభన్ తొలి సినిమా బాబీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కాగా రాధాకృష్ణ కుమార్ తొలి సినిమా జిల్ కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. వర్షం, రాధేశ్యామ్ మధ్య పోలికలు ఉండటంతో వర్షం ఫలితాన్ని రాధేశ్యామ్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వర్షం సెంటిమెంట్ రాధేశ్యామ్ సినిమా విషయంలో నిజమవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus