యాంకర్ వర్షిణి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. వెండితెరపై కూడా కొన్ని సినిమాల్లో మెరిసింది కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ‘శంభో శివ శంభో’ ‘లవర్స్’ ‘కాయ్ రాజా కాయ్’ ‘నన్ను దోచుకుందువటే’ ‘జోడి’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది. కానీ అవి ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపుని తెచ్చిపెట్టలేదు. అయితే ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్ క్లిక్ అయ్యింది. అది సక్సెస్ అవ్వడంతో ‘ఢీ’ వంటి షోలలో ఈమెకు అవకాశాలు వచ్చాయి.
ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. బుల్లితెర పై వరుస షోలతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 1.8 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చాలా పద్దతిగా, లక్షణంగా కనిపిస్తుంది.
ఓ పెళ్లికూతురులా రెడీ అయ్యి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో ఈమె పెళ్లి చేసుకుంటుందా? అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అలాంటిది ఏమీ లేదు. ఆమె తన ఫ్రెండ్ పెళ్ళిలో దిగిన ఫోటోలు అని తెలుస్తుంది. ‘బీచ్ సైడ్ వెడ్డింగ్’ అంటూ వర్షిణి ఈ ఫోటోలకు క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!