Bhanu Sri Mehra: అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు గ్లామర్‌తో పాటు పర్ఫార్మ్ చేసే టాలెంట్ కూడా ఉండాలి.. అందుకే తాటికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు. అల్లు అర్జున్, గుణ శేఖర్‌ల కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కి, అంచనాలను అందుకోలేక డిజాస్టర్‌గా మిగిలిన సినిమా ‘వరుడు’.. భాను శ్రీ మెహ్రా ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. రిలీజ్ అయ్యి థియేటర్లలో చూసే వరకు ఆమె ఫేస్ ఎక్కడా రివీల్ చేయకుండా క్యూరియాసిటీ పెంచేశాడు డైరెక్టర్..

కట్ చేస్తే.. ‘‘ఈమె హీరోయిన్ ఏంటి?.. అనుకున్నంత లేదే’’ అని పెదవి విరిచారు ఆడియన్స్.. తర్వాత ‘గోవిందుడు అందరి వాడేలే’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’, ‘అలా ఎలా’, ‘మిస్ ఇండియా’, ‘టెన్త్ క్లాస్ డైరీస్’ లాంటి కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్, క్యామియో క్యారెక్టర్స్ చేసింది కానీ సరైన బ్రేక్ అయితే రాలేదు.. హిందీ, తమిళ్, కన్నడ, పంజాబీలోనూ యాక్ట్ చేసింది కానీ కాలం, అదృష్టం రెండూ కలిసి రాలేదు.. అడపా దడపా వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటుంది..

అయితే సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు టచ్‌లో ఉంటుంది.. తన లేటెస్ట్ పిక్స్, వీడియోస్ వంటివి షేర్ చేస్తుంటుంది.. 38 వయసులోనూ చక్కగా ఫిట్‌నెస్ మెయింటెన్ చేస్తోంది భాను.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 98.4K మంది ఫాలో అవుతున్నారు..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus