2022 సంవత్సరంలో విడుదలైన సినిమాలలో సౌత్ సినిమాలలో చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిస్తే నార్త్ సినిమాలలో చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. సౌత్ లోని అన్ని ఇండస్ట్రీలలో స్టార్ హీరోల సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకుంటుంటే నార్త్ ఇండియాలోని స్టార్ హీరోల సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. బాలీవుడ్ హీరోలు రొటీన్ కథ, కథనాలను ఎంచుకోవడం వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
అయితే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కరోనా విజృంభణ వల్ల గడిచిన రెండు సంవత్సరాలుగా బాలీవుడ్ సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయని వరుణ్ ధావన్ చెప్పుకొచ్చారు. ఈ మధ్యే బాలీవుడ్ సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయని వరుణ్ ధావన్ వెల్లడించారు. ఈ సినిమాలలో కొన్ని సినిమాలు ప్రేక్షకాదరణ పొందలేదని వరుణ్ ధావన్ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి సినిమాలు వస్తున్నాయని వరుణ్ ధావన్ కామెంట్లు చేశారు.
సౌత్ సినిమాలకు మాత్రమే సక్సెస్ లు ఉన్నాయని అనుకోలేమని వరుణ్ ధావన్ వెల్లడించారు. ఈ మధ్య కాలంలో సౌత్ లో కూడా 7 నుంచి 8 సినిమాలు ఫ్లాప్ అయ్యాయని వరుణ్ ధావన్ చెప్పుకొచ్చారు. మంచి సినిమా ఏ భాషలో వచ్చినా ప్రేక్షకుడు వదులుకోడని వరుణ్ ధావన్ కామెంట్లు చేశారు.
చెడ్డ సినిమాను చూడాలని ఏ ప్రేక్షకుడు అనుకోడని వరుణ్ ధావన్ వెల్లడించారు. వరుణ్ ధావన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అయితే నార్త్ సినిమాలతో పోల్చి చూస్తే సౌత్ సినిమాలు ఎక్కువగా సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. బాలీవుడ్ సినిమాలు ఓటీటీలలో కూడా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంలొ ఫెయిల్ అవుతున్నాయి.