Varun Tej Weds Lavanya: ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి అయితే కొన్నిసార్లు ఆ రూమర్స్ నిజం అవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలోనే మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టినటువంటి వారిలో నటుడు వరుణ్ తేజ్ ఒకరు. నాగబాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈయన హీరోగా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక వరుణ్ తేజ్ నటించిన లావణ్య త్రిపాఠితో కలిసి అంతరిక్షం,మిస్టర్ వంటి సినిమాలలో నటించారు.

అయితే ఈ సినిమాల్లో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వీరి గురించి వార్తలు వచ్చాయి.ఇక ఈ వార్తలకు అనుగుణంగా వీరిద్దరూ కలిసి పలు పార్టీలకు వెళ్లడం ఫ్యామిలీ ఫంక్షన్లలో అటెండ్ కావడం వంటివి వీరిద్దరూ నిజంగానే రిలేషన్ లో ఉన్నారన్న వార్తలకు బలం చేకూర్చాయి. ఇక వరుణ్ సోదరి నిహారిక వివాహానికి ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఎవరు హాజరు కాలేదు కానీ లావణ్య త్రిపాఠి మాత్రమే ఈ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇక లావణ్య (Varun Tej) వరుణ్ తేజ్ ప్రేమ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే లావణ్య ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేసిన ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ వరుణ్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈయన లావణ్య త్రిపాఠితో కలిసి ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు

దీంతో ముందుగా వీరిద్దరూ ఘనంగా నిశ్చితార్థం జరుపుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిశ్చితార్థపు తేదీని కూడా ఫిక్స్ చేశారని సమాచారం. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 9వ తేదీ లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగబోతుంది అని తెలుస్తుంది. త్వరలోనే వీరి నిశ్చితార్థానికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus