Varun Tej: పెళ్లి విషయంపై మెగాహీరో రియాక్షన్ ఇదే..!

మెగాప్రిన్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘గని’ ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అరవింద్ సమర్పిస్తోన్న ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ‘ఎఫ్ 2’, ‘గద్దలకొండ గణేష్’ వంటి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న వరుణ్ ఇప్పుడు ‘గని’ సినిమాతో హ్యాట్రిక్ అందుకుంటారని మెగాఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఆమె నటిస్తోన్న తొలి సినిమా ఇది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో రూపొందించారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ‘గని’ సినిమా విశేషాలతో పాటు.. తన పెళ్లి గురించి తండ్రి నాగబాబు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. తన చెల్లెలు నీహారికను, తనను నాన్న గారు ఫోన్ చేసి ఎక్కడున్నారని అడుగుతుంటారని.. అలా అడగొద్దని చెప్పినా.. ఆయనకు మాత్రం అలవాటు అని తెలిపారు. నాగబాబు నిర్వహించే ‘ఆస్క్ మీ క్వశ్చన్’ చిట్ చాట్ లో ఫ్యాన్స్ అంతా వరుణ్ తేజ్ పెళ్లి గురించి ప్రశ్నించడంపై రియాక్ట్ అయ్యారు ఈ యంగ్ హీరో.

ఈ విషయంలో తన తండ్రి వరుణ్‌నే అడగండి అని చెబుతున్నారని.. తనపై నమ్మకం వచ్చిన తరువాత నిర్ణయం తనకే వదిలేస్తున్నారని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. సినిమాలనే కాదు.. ప్రతి విషయాన్ని తనకే వదిలేస్తున్నారని.. నాన్నకి నాపై నమ్మకం ఎక్కువ అని చెప్పారు వరుణ్ తేజ్.హీరో అవ్వకముందు జిమ్ కి వెళ్లమని చెప్పేవారని.. యాక్టింగ్ నేర్చుకో.. బుక్స్ బాగా చదువు అని చెప్పేవారు కానీ అలా ఉండాలి, ఇలా ఉండాలి అని మాత్రం చెప్పరని వరుణ్ తేజ్ స్పష్టం చేశాడు.

సినిమా విషయంలో కూడా కథ తను విన్న తరువాత సెకండ్ ఒపీనియన్ కోసం నాన్నను అడుగుతానే తప్ప.. సొంతంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన యాక్సెప్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు. తను సరైన నిర్ణయం తీసుకుంటానని ఆయన(నాగబాబు) నమ్మకమని తెలిపారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus