Varun Tej: వరుణ్ తేజ్ అక్కడ సత్తా చాటుతారా?

మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ కు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు ఉంది. వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా త్వరలో రిలీజ్ కానుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ యంగ్ హీరో బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టారని త్వరలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వరుణ్ తేజ్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇతర హీరోలలా కాకుండా బాలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమా చేయాలని వరుణ్ తేజ్ భావిస్తున్నట్టు బోగట్టా.

హిందీలో యాక్షన్ సినిమాలకు భారీస్థాయిలో ఆదరణ ఉంటుందనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్స్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్లు హిందీలోకి డబ్బింగ్ కావడంతో పాటు మంచి ఆదరణ పొందుతున్నాయి. తనకు ఉన్న క్రేజ్ ను, మార్కెట్ ను పెంచుకోవాలనే ఆలోచనతో వరుణ్ తేజ్ ఈ విధంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీలో ఛత్రపతి రీమేక్ లో నటిస్తుండగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం ఒక స్ట్రెయిట్ హిందీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం.

త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉంది. గని సినిమాతో వరుణ్ తేజ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు వరుణ్ ఎఫ్3 సినిమాలో నటిస్తుండగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్3 మూవీ రిలీజ్ కానుంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus